Jr NTR Oscar: ఆస్కార్ రెడ్ కార్పెట్ పై అలా నడుస్తా.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఎన్టీఆర్ మాటలు!

బాల నటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరించాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. తర్వాత నిన్ను చూడాలని అనే సినిమా ద్వారా హీరోగా తెలుగు చిత్రసీమకు పరిచయం అయి.. స్టూడెంట్ నెంబర్ 1 మూవీతో తానేంటో నిరూపించికున్నాడు. ఆది, సింహాద్రి సినిమాలతో మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. పాత్ర ఎలాంటిదైన తన నటనతో, డ్యాన్స్ తో, ఎక్స్ ప్రెషన్స్ తో, ఫైట్స్ తో ఆద్యంతం ఆకట్టుకుంటాడు తారక్.

ఇక ఎన్టీఆర్ కొమురం భీమ్ అవతారం ఎత్తిన సినిమా RRR. నాటు నాటు పాట ఆస్కార్ బరిలో నిలిచిన వేళ ఎన్టీఆర్ అమెరికాలో సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో ఆస్కార్ రెడ్ కార్పెట్ పై ఎలా నడుస్తాడో చెప్పి గూస్ బంప్స్ తెప్పించాడు తారక్.

గ్లోబల్ స్టార్ గా..

గ్లోబల్ స్టార్ గా..

వరుస హిట్లతో ఫుల్ జోష్ లో ఉన్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దర్శక దిగ్గజం రాజమౌళి తరెకెక్కించిన RRR (రౌద్రం రణం రుధిరం) సినిమాతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. భారీ అంచనాలతో పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా భారీ హిట్ అందుకుంది. అంతేకాదు, ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. అలాగే, తారక్‌కు అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్‌ను తీసుకొచ్చి గ్లోబల్ స్టార్ ను చేసేసింది.

విమర్శకుల ప్రశంసలు..

విమర్శకుల ప్రశంసలు..

జూనియర్ ఎన్టీఆర్ RRR (రౌద్రం రణం రుధిరం) చిత్రంలో కొమరం భీమ్ పాత్రను పోషించిన విషయం తెలిసిందే. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ నటన, పలికించిన హావభావాలు, చూపించిన భావోద్వేగం, యాక్షన్ సన్నివేశాలకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్పందన దక్కింది. ఒక్క ఇండియాలోనే కాకుండా ఈ సినిమా విడుదలైన అన్ని దేశాల్లోనూ ఎన్టీఆర్ నటనకు అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అలాగే విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు.

ఇటీవలే అమెరికాకు..

ఇటీవలే అమెరికాకు..

ఇదిలా ఉంటే RRRలోని నాటు నాటు ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నిలిచిన విషయం తెలిసిందే. ఇందుకోసం RRR టీమ్ అమెరికాలో సందడి చేస్తోంది. అమెరికాలో అవార్డ్ ఫంక్షన్స్ కు హాజరవుతూ బిజీగా ఉంది చిత్రబృందం. ఇప్పటికే రాజమౌళి, కీరవాణి, రామ్ చరణ్, సెంథిల్ కుమార్, రాజమౌళి కొడుకు కార్తికేయ అమెరికాలో ముందు సందడి చేయగా.. ఇటీవలే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అమెరికా వెళ్లాడు.

దేశం గర్వించేలా..

దేశం గర్వించేలా..

అమెరికాలో ల్యాండ్ అయిన తారక్ కు అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. అక్కడ ఎమోషనల్ గా మాట్లాడిన తారక్ కాలిఫోర్మియా నుంచి ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే. దీంతోనే ప్రమోషన్స్ లో పాల్గొంటున్నట్లు హింట్ ఇచ్చిన ఎన్టీఆర్ ప్రస్తుతం పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలోనే ఎంటర్టైన్ మెంట్ టునైట్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు తారక్. ఇందులో దేశం గర్వించేలా ఆయన మాట్లాడారు.

నటుడిగా నడవను..

నటుడిగా నడవను..

నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్ రావడం గురించి ఎన్టీఆర్ ను హోస్ట్ అడగ్గా.. "ప్రపంచవ్యాప్తంగా సినిమాను సెలబ్రేట్ చేసుకునే ఆస్కార్ అవార్డ్ వేడుకల్లో భాగం కావడం కంటే గొప్పగా ఒక నటుడు, ఫిల్మ్ మేకర్ ఏం కోరుకుంటాడు. ఆస్కార్ అవార్డ్స్ రోజున RRR హీరోగా లేదంటే.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నటుడిగా రెడ్ కార్పెట్ మీద నడవను. భారతీయుడిగా ఆస్కార్ రెడ్ కార్పెట్ మీద నడుస్తా. నా గుండెల్లో దేశాన్నినింపుకుని గర్వంగా సగర్వంగా నడుస్తా" అని ఎన్టీఆర్ సమాధానం ఇచ్చాడు.

ఇప్పటికీ నొప్పి పెడుతున్నాయి..

ఈ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ మాటలు అభిమానులు, దేశం గర్వించేలా ఉండటమే కాకుండా గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. అలాగే తర్వాత నాటు నాటు పాటలో స్టెప్పుల గురించి ప్రస్తావన రాగా.. ఆ పాటకు స్టెప్పులు వేయడం వల్ల తన కాళ్లు ఇంకా నొప్పి పెడుతున్నాయని ఎన్టీఆర్ సరదాగా చెప్పాడు. ఇదిలా ఉంటే ఈ పాట కోసం దర్శక ధీరుడు రాజమౌళి కాంప్రమైజ్ కాకుండా తమతో 17 టేక్స్ చేయించారని తారక్, చెర్రీ గతంలో చెప్పిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X