Ram Charanపై అమెరికన్ యాంకర్ పొగడ్తలు.. హాలీవుడ్ చిత్రాలపై చరణ్.. ఏకైక ఇండియన్ హీరోగా ఘనత!

ప్రస్తుతం రామ్ చరణ్ రేంజ్ పెరిగిపోయింది. మెగా పవర్ స్టార్ గా తెలుగు ప్రేక్షకుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఇక జక్కన్న తెరకెక్కించిన రౌద్రం రణం రుధిరం (RRR) సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తెగ పాపులర్ అయిపోయాడు.

అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటనపై తెలుగు ప్రేక్షకులు, సినీ విమర్శకులే కాకుండా విదేశీయులు సైతం కొనియాడుతున్నారు. ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ ముందుగా అమెరికా వెళ్లి అక్కడి మీడియా ప్రతినిధులతో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.

యావత్ ప్రపంచమే..

యావత్ ప్రపంచమే..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా ద్వారా దేశవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. రౌద్రం రణం రుధిరం సినిమా అనేక అవార్డులను కొల్లగొట్టింది. ఎమ్ఎమ్ కీరవాణి మ్యాజికల్ మ్యూజిక్ గా వచ్చిన ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో అదరగొట్టిన చెర్రీ నటనకు యావత్ ప్రపంచమే ప్రశంసల జల్లులు కురిపించింది. తెలుగు సినిమా చిరకాల కోరిక అయిన ఆస్కార్ కోసం నాటు నాటు సాంగ్ అకాడమీ అవార్డుల నామినేషన్స్ లో ఉంది.

స్పెషల్ ఇంటర్వ్యూ..

స్పెషల్ ఇంటర్వ్యూ..

RRRలోని నాటు నాటు పాటకు కచ్చితంగా ఆస్కార్ అవార్డు వస్తుందని చిత్ర యూనిట్ తో పాటు కోట్లాది భారతీయులు నమ్ముతున్నారు. ఈ క్రమంలో ఆస్కార్ వేడుకల కంటే ముందుగానే చిత్రబృందం అమెరికా వెళ్లింది. ఇందులో భాగంగానే రామ్ చరణ్ వరుస పెట్టి అమెరికన్ పాపులర్ మీడియా ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే అమెరికాలో అత్యధికమంది వీక్షించే గుడ్ మార్నింగ్ అమెరికాలో షోలో పాల్గొన్నాడు. తాజాగా మరోక ఛానెల్ ABC న్యూస్ కు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు చెర్రీ.

టూరిస్ట్ లా వెళ్లాలనిపించింది..

టూరిస్ట్ లా వెళ్లాలనిపించింది..

రామ్ చరణ్ ను ఇంటర్వ్యూ చేసిన రీవ్ విల్ నాటు నాటు సాంగ్ గురించి అడిగారు. అందుకు "RRR కోసం చాలా కష్టంపడ్డాం. యుద్ధం మొదలు కావడానికి ముందు ఉక్రెయిన్ లో నాటు నాటు పాట చిత్రీకరించాం. వారం రోజులు రిహార్సల్స్, 15 రోజులు షూట్ చేయడం జరిగింది. ఉక్రెయిన్ అందమైన దేశం. ప్రజలు చాలా మంచివారు. అందమైన లొకేషన్లలో ఆ సాంగ్ షూట్ చేశాం. షూటింగ్ అయ్యాక ఇండియా వచ్చిన తర్వాత కూడా నాకు ఒక టూరిస్ట్ లా ఉక్రెయిన్ కు వెళ్లాలనిపించింది" అని చరణ్ తెలిపాడు.

ఇండియన్ సినిమా విజయం..

ఇండియన్ సినిమా విజయం..

ఒకవేళ నాటు నాటుకి ఆస్కార్ వస్తే అన్న ప్రశ్నకు.. "ఆస్కార్ వస్తే అంతకంటే గొప్ప విషయం ఏం లేదు. భారతీయుడిగా గర్వపడతాను. ఆస్కార్ అవార్డు స్థాయికి ఇండియన్ సినిమా రావడం సంతోషం. 80 ఏళ్ల చరిత్ర కలిగిన ఇండియన్ సినిమా ఆస్కార్ దక్కించుకుంటే అదో అద్భుత ఘట్టంగా భావిస్తాను. దాన్ని బాధ్యతగా భావించి మరిన్ని ఆస్కార్ అవార్డ్స్ గెలుచుకునేందుకు కృషి చేస్తాం. నాటు నాటుకు ఆస్కార్ వస్తే అది సమిష్టి కృషిగా. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ విజయంగా భావిస్తాను. ఇది కేవలం మాటలు కాదు మనస్ఫూర్తిగా చెబుతున్నాను" అని రామ్ చరణ్ పేర్కొన్నాడు.

అవకాశం వస్తుందేమో..

అవకాశం వస్తుందేమో..

RRRతో మీకు గ్లోబల్ ఫేమ్ వచ్చింది. హాలీవుడ్ చిత్రాలు చేయాలనుకుంటున్నారా అని అడిగితే.. "నేను ఆల్రెడీ కొన్ని ఇండియన్ ప్రాజెక్ట్స్ ఒప్పుకున్నా. అయితే హాలీవుడ్ మేకర్స్ తో పని చేయాలనే కోరిక ఉంది. అవుట్ సైడ్ ఇండియా చిత్రాలు చేయాలనే ప్లాన్స్ ఉన్నాయి. నేను ఇష్టపడే అనేక మంది డైరెక్టర్స్ హాలీవుడ్ లో ఉన్నారు. చూద్దాం. భవిష్యత్తులో హాలీవుడ్ చిత్రాలు చేసే అవకాశం వస్తుందేమే. నేనైతే సిద్ధంగా ఉన్నాను" అని చెర్రీ అన్నాడు.

రామ్ చరణ్ ఘనత..

రామ్ చరణ్ ఆన్సర్ కి.. "మీకు హాలీవుడ్ లో కచ్చితంగా అవకాశాలు వస్తాయని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మీరు గొప్ప నటుడిగా నిరూపించుకున్నారు" అని యాంకర్ రీవ్ విల్ చెప్పడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. అంతర్జాతీయ సినిమాలను స్వీకరించే మంచి మనసు హాలీవుడ్ కు ఉందన్న చెర్రీ ఫిబ్రవరి 24న బెవర్లీ హిల్స్ లో జరగబేయే HCA (హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్) అవార్డ్స్ కి ప్రజంటర్ గా హాజరు కానున్నాడు.

ఈ ఈవెంట్ లో విన్నర్స్ అయిన హాలీవుడ్ ప్రముఖులకు చెర్రీ చేతులమీదుగా అవార్డ్స్ అందుకోనున్నారు. ఇలాంటి ఘనతను అందుకున్న తొలి ఇండియన్ హీరోగా రామ్ చరణ్ రికార్డ్ క్రియేట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X