For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RRR నుంచి కీలక సీన్ లీక్.. ఎన్టీఆర్ ను కొరడాతో కొట్టి ఏడ్చిన చరణ్.. అసలు కధ ఏంటంటే?

  |

  టాలీవుడ్ లో ఇప్పుడు మోస్ట్ అవైటెడ్ సినిమా ఏదైనా ఉంది అంటే అది రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా అని చెప్పక తప్పదు. ఈ సినిమా ప్రకటన వచ్చిన నాటి నుంచి ఈ సినిమాకు సంబంధించి రోజు ఏదో ఒక వార్త బయటకు వస్తూనే ఉంది. అయితే తాజాగా లీకైన విషయం మాత్రం సినిమా మీద భారీ అంచనాలు పెంచేస్తుంది. అసలు ఈ సినిమా మీద ఎందుకు పెరుగుతున్నాయి అనే వివరాల్లోకి వెళితే

  షర్ట్ బటన్స్ తీసేసి షాకిచ్చిన ధన్య బాలకృష్ణ: హాట్ హాట్ ఫోజులతో రెచ్చిపోయిన సుధీర్ లవర్

  కధ ఇదేనంటూ ప్రచారం

  కధ ఇదేనంటూ ప్రచారం

  స్టార్ హీరోలు రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్నారు. డి.వి.వి.దానయ్య నిర్మాతగా సుమారు 400 కోట్ల పైచిలుకు బడ్జెట్తో ఈ సినిమాను రూపొందిస్తున్న ఈ సినిమా తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందుతుండగా సినిమా కూడా ఏకకాలంలో ఈ ఐదు భాషల్లోనే కాక కొన్ని విదేశీ భాషల్లో సైతం విడుదల కాబోతోంది.

  నిజానికి మెగాస్టార్ కుటుంబం నుంచి రామ్ చరణ్ తేజ నందమూరి కుటుంబం నుంచి నందమూరి తారకరామారావును రాజమౌళి ఎంపిక చేసుకోవడమే ఈ సినిమాకి పెద్ద అసెట్ గా చెబుతున్నారు.. ఈ సినిమా చేస్తున్నాము అనే ప్రకటన వచ్చిన నాటి నుంచి ఈ సినిమా కథ అలా ఈ సినిమా కథ ఇలా అంటూ రకరకాల ప్రచారాలు జరిగాయి.

  Bigg Boss telugu 5: క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియ రేర్ ఫొటోస్.. వయసు కనిపించకుండా హాట్ ఫొటోస్

  మళ్ళీ మళ్ళీ లీకులు

  మళ్ళీ మళ్ళీ లీకులు

  ఇది కరెక్ట్ కాదు అని భావించి రాజమౌళి ఏకంగా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ అల్లూరి సీతారామరాజు పాత్రలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నాడని వెల్లడించారు.. రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా అలియా భట్ నటిస్తుండగా ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ హీరోయిన్ గా నటిస్తోంది.

  తమిళ దర్శక నటుడు సముద్రఖని కీలక పాత్రలో నటిస్తుండగా అజయ్ దేవగన్, రాహుల్ రామకృష్ణ అలాగే ఇతర నటీనటులు చాలా మంది ఈ సినిమాలో భాగమయ్యారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి లీకేజీలు బయటకు రాకుండా ఉండడానికి రాజమౌళి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా సరే ఏదో ఒక విధంగా ఈ సినిమా నుంచి లీకులు బయటకు వస్తూనే ఉన్నాయి.

  Bigg Boss Telugu 5: RJ కాజల్ బ్యూటీఫుల్ ఫొటోస్.. అందంతో కూడా ఆల్ రౌండర్

  గతంలోనే లీక్

  గతంలోనే లీక్

  నిజానికి సుమారు ఏడాది క్రితం ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ మధ్య ఒక ఫైట్ సీన్ ఉంటుందని ఆ సీన్ చూడాల్సింది తప్ప ఎంత వర్ణించినా చెప్పలేము అంటూ ఒక కంపెనీ ఆర్టిస్ట్ ఇంటర్వ్యూలో వెల్లడించగా హుటా హుటిన రంగంలోకి దిగిన రాజమౌళి టీం ఆ ఇంటర్వ్యూ అప్పటికప్పుడు డిలీట్ చేయించింది.

  ఆ తర్వాత కూడా సినిమాకు సంబంధించి ఎలాంటి లీకేజీలు బయటకు వచ్చినా ఊరుకునేది లేదంటూ సినిమా లో భాగమైన ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇచ్చారు. అయితే అనూహ్యంగా ఇప్పుడు మరో విషయం బయట సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తాజాగా సుజాత అనే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ తాను ఈ సినిమాలో నటించానని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీంతో ఇంటర్వ్యూ చేసేవారు ఈ సినిమాకి సంబంధించి మరిన్ని విషయాలు చెప్పాలని కోరగా కీలకంగా భావిస్తున్న ఒక ఎపిసోడ్ చెప్పేసింది.

  కొట్టేసి ఏడ్చిన ఎన్టీఆర్

  కొట్టేసి ఏడ్చిన ఎన్టీఆర్

  ఆమె వెల్లడించిన ప్రకారం ఆమె కొమరం భీమ్ అంటే ఎన్టీఆర్ వీధిలో నివాసం ఉండే ఒక మహిళ పాత్రలో నటించింది. ఇక షూటింగ్ సమయంలో రామ్ చరణ్ గాయపడ్డారని బాగా ఎత్తుగా ఉన్న ప్రదేశం నుంచి ఆయన కింద పడడంతో ఆయన కాలు బెణికింది అని కూడా ఆమె వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ రామ్ చరణ్ తేజ కథలో భాగంగా ఎన్టీఆర్ను కట్టేసి ఉండగా కొరడా తీసుకుని కొట్టాల్సి వస్తుంది.

  అయితే కొరడాతో రెండు దెబ్బలు కొట్టిన అనంతరం ఎన్టీఆర్ కి ఎక్కడ దెబ్బ తగిలిందో అనే ఉద్దేశంతో వెంటనే వెళ్లి రామ్ చరణ్ తేజ ఆయనను హత్తుకుని కన్నీళ్ల పర్యంతమయ్యారట. అసలు ఈ సీన్ చూసిన తర్వాత అక్కడ షూటింగ్ స్పాట్ లో ఉన్న అందరూ ఆశ్చర్యపోయారు అని అక్కడున్న అందరూ చప్పట్లతో ఈ రామ్ చరణ్ ను మెచ్చుకున్నారని చెప్పుకొచ్చారు.

  జాగ్రత్తగా లేకుంటే అంతే

  జాగ్రత్తగా లేకుంటే అంతే

  అయితే ఇలాంటి సీన్లు బయటకు లీకవుతున్న నేపథ్యంలో రాజమౌళి అండ్ టీం చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. చిన్న చిన్న ఆర్టిస్టులే కదా వాళ్ళు ఎవరికీ చెబుతారు అని భావిస్తే కష్టమే. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా పరిధి పెరిగిపోయిన తర్వాత ఎవరు సెలబ్రిటీ, ఎవరు సెలబ్రిటీ కాదు అనే విషయం కూడా ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు.

  ఎందుకంటే సెలబ్రిటీలు అని భావిస్తున్న వారిని మాత్రమే కాకుండా సామాన్యులను సైతం ఇప్పుడు ఇంటర్వ్యూలు చేసి బయటకు విషయాలు అలాగే పరిస్థితి కనిపిస్తోంది. అలాంటప్పుడు కంపెనీ ఆర్టిస్టులు, చిన్నచిన్న ఆర్టిస్టులకు సైతం ఈ షూటింగుకు సంబంధించి ఎలాంటి వివరాలు బయటకు వెల్లడించకుండా ఉండేలాగా కొన్ని సూచనలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. లేదంటే సినిమాల్లో కీలకంగా భావిస్తున్న సీన్లు అన్నీ లీకయ్యే అవకాశాలు ఉన్నాయి.. అయితే వీరిద్దరి మధ్య ఫైట్ ఉంటుందని గతంలో విజయేంద్ర ప్రసాద్ కూడా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది.

  English summary
  Ever since the announcement of the RRR movie, there has been some news coming out today regarding this movie. However, the latest leaked content raises huge expectations on the film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X