RRR: ఆయన కాళ్లకు నమస్కరించి రామ్ చరణ్ ఎమోషనల్.. చనిపోయే వరకూ అది మర్చిపోనంటూ బాధగా!

కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా ప్రాంతాల్లో మారుమ్రోగుతూ హాట్ టాపిక్ అవుతోన్న చిత్రాల్లో RRR (రౌద్రం రణం రుధిరం) ఒకటి. తన సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుడు రాజమౌళి రూపకల్పనలో.. టాలీవుడ్‌ను ఏలుతున్న ఇద్దరు స్టార్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన చిత్రమే ఇది. అందుకే ఈ మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని త్వరలోనే గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఇందులో రామ్ చరణ్ ఎమోషనల్ అయిపోయాడు. అసలేం జరిగిందో చూద్దాం పదండి!

మెగా.. నందమూరి మల్టీస్టారర్‌గా

మెగా.. నందమూరి మల్టీస్టారర్‌గా

స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా రాజమౌళి రూపొందిన మూవీనే RRR (రౌద్రం రణం రుధిరం). భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రానికికి కీరవాణి సంగీతం ఇచ్చారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. ఈ సినిమాలో తారక్.. కొమరం భీం, చరణ్.. అల్లూరి పాత్రలను చేస్తున్న విషయం తెలిసిందే.

గ్రాండ్ రిలీజ్.. అంతటా హవానే

గ్రాండ్ రిలీజ్.. అంతటా హవానే


టాలీవుడ్ హిస్టరీలోనే భారీ మల్టీస్టారర్‌గా రూపొందిన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీని మార్చి 25న ఎంతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఓవర్సీస్ సహా ఎన్నో ప్రాంతాల్లో టికెట్ల బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అంతేకాదు, చాలా చోట్ల అప్పుడే టికెట్లు పూర్తిగా అమ్ముడుపోయాయి. దీంతో ప్రపంచమంతా ఈ సినిమా హవానే కనిపిస్తోంది.

వైభవంగా RRR మూవీ ఫంక్షన్

వైభవంగా RRR మూవీ ఫంక్షన్

క్రేజీ కాంబోలో వస్తోన్న RRR (రౌద్రం రణం రుధిరం) రిలీజ్‌కు రెడీ అవడంతో కర్నాటకలోని చిక్‌ బల్లాపూర్‌లో శనివారం సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఎంతో వైభవంగా జరిగిన ఈ వేడుకకు మెగా, నందమూరి ఫ్యాన్స్ హాజరయ్యారు. దీనికి ముఖ్య అతిథిగా కర్నాటక సీఎం బస్వరాజ్ బొమ్మై, శివరాజ్‌కుమార్ విచ్చేశారు. వీళ్లతో పాటు పలువురు ప్రముఖులూ వచ్చారు.

కాళ్లకు నమస్కరించిన చరణ్

కాళ్లకు నమస్కరించిన చరణ్


కొన్ని వేల మంది అభిమానులు మధ్యన జరిగిన RRR (రౌద్రం రణం రుధిరం) ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రామ్ చరణ్ చేసిన ఒక పని హైలైట్ అయింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కన్నడ సూపర్ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ స్టేజ్ పైకి వచ్చిన సమయంలో ఈ మెగా పవర్ స్టార్ ఆయన దగ్గరకు వెళ్లి కాళ్లకు నమస్కరించాడు. దీంతో ఫ్యాన్స్ కేకలు వేస్తూ అభినందించారు.

ఈవెంట్‌లో చరణ్ ఎమోషనల్

ఈవెంట్‌లో చరణ్ ఎమోషనల్


ఈ ఈవెంట్‌లో రామ్ చరణ్ మాట్లాడుతూ.. 'మా కుటుంబ సభ్యుడు.. మా బిగ్ బ్రదర్.. పునీత్ రాజ్‌కుమార్ గారు మన మధ్య లేడంటే నమ్మాలని లేదు. నమ్మను కూడా. ఆయన ఇక్కడే ఉంటూ మనల్ని ఆశీర్వదిస్తుంటాడు. ఆయన లేని లోటు శివన్న ద్వారా తీర్చుకుంటాం. మీరు చేసిన సాయాన్ని చనిపోయే వరకూ గుర్తు పెట్టుకుంటాను' అంటూ ఎమోషనల్ అయిపోయాడు.

ప్రస్తుతానికి జీరో ఫీలింగ్స్ అని

ప్రస్తుతానికి జీరో ఫీలింగ్స్ అని


సినిమా గురించి రామ్ చరణ్ మాట్లాడుతూ.. 'మా కోసం ఇంత ఓర్పుగా ఎదురుచూస్తున్నా తారక్ అభిమానులు, మెగా అభిమానులకు పేరు పేరునా థ్యాంక్స్. మీరంతా నీడలా మా వెంట ఉన్నారు. మార్చి 25న మా కష్టం, మా శ్రమను మీకు చూపించేందుకు వస్తున్నాం. ప్రస్తుతం ఇప్పుడు జీరో ఫీలింగ్స్ ఉన్నాయి. మీ అందరూ సినిమా చూసి సక్సెస్ చేయండి' అని చెప్పాడు.

 కర్నాటక కూడా పెద్ద మార్కెట్

కర్నాటక కూడా పెద్ద మార్కెట్


చివర్లో చరణ్ 'కర్ణాటక తెలుగు సినిమాకు పెద్ద మార్కెట్. ఏపీ, తెలంగాణ ఎంత పెద్ద మార్కెటో.. కర్ణాటక కూడా అంతే. ఈ సినిమాను ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్న కేవీఎన్ గారికి థ్యాంక్స్. దానయ్య గారికి, కీరవాణి గారికి థ్యాంక్స్. ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా బ్రదర్‌ను ఆహ్వానిస్తాను' అంటూ ముగించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X