హీరోగా పరిచయం కాబోతున్న RRR నిర్మాత వారసుడు.. టాలెంటెట్ డైరెక్టర్ ఫిక్స్
ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమాను నిర్మించిన అగ్ర నిర్మాత డివివి.దానయ్య ప్రస్తుతం RRR సినిమా రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మార్చి 25న విడుదల కాబోతున్న ఆ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే ఆ సినిమా విడుదల అనంతరం డివివి.దానయ్య తన వారసుడి సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకు రానున్నాడు. దానయ్య ఏకైక వారసుడు కళ్యాణ్ గత కొంతకాలంగా నటనలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు.
ఫైట్స్, డ్యాన్స్ యాక్షన్ ఇలా అన్ని రకాల యాంగిల్స్ లోను రాటు దేలుతున్న కళ్యాణ్ తన మొదటి సినిమాకు తగ్గట్టుగా మరోసారి బ్యాక్ గ్రౌండ్ వర్క్ కూడా చేస్తున్నట్లు సమాచారం. ఇక కళ్యాణ్ మొదటి సినిమా కోసం నిర్మాత దానయ్య గత రెండేళ్ల నుంచి టాలెంటెట్ దర్శకులతో చర్చలు జరుపుతున్నారు. ఇద్దరు ముగ్గురు దర్శకులతో ఆల్ మోస్ట్ ప్రాజెక్టులు సెట్టయినట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే అఫీషియల్ గా ఎలాంటి ఎనౌన్స్మెంట్ అయితే రాలేదు. ఇక ఫైనల్ గా దానయ్య ఇటీవల ఒక టాలెంటెట్ దర్శకుడిని ఫిక్స్ చేసినట్లు సమాచారం.

ఆ దర్శకుడు మరెవరో కాదు. యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ అద్భుతమైన కథతో దానయ్య కొడుకును ఇండస్ట్రీలోకి తీసుకు రానున్నట్లు సమాచారం. పలు షార్ట్ ఫిలిమ్స్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న ప్రశాంత్ వర్మ మొదట అ! అనే సినిమాతో వెండితెరకు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినప్పటికి దర్శకుడిగా ప్రశాంత్ ఓ వర్గం ప్రేక్షకులలో మంచి క్రేజ్ అందుకున్నాడు. ఇక ఆ తరువాత వచ్చిన కల్కి సినిమా కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది కానీ కమర్షియల్ గా ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేకపోయింది.
మొత్తానికి జాంబీ రెడ్డి సినిమాతో ప్రశాంత్ వర్మ కమర్షియల్ గా పరవాలేదు అనే విధంగా మంచి హిట్ అయితే అందుకున్నాడు. ఇక ఆ నిర్మాతలతోనే అతను హనుమాన్ అనే పాన్ ఇండియా సినిమాతో రావడానికి సిద్ధమయ్యాడు. ఆ సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రానుంది. ఒకప్పటి చైల్డ్ యాక్టర్ తేజ సజ్జ అందులో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ప్రశాంత్ వర్మ దానయ్య కొడుకును హీరోగా పరిచయం చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. దాదాపు స్క్రిప్ట్ అయితే ఫైనల్ అయినట్లు సమాచారం. ఇక హనుమాన్ ప్రాజెక్ట్ ఫినిష్ అయిన అనంతరం ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉందట. ఇక దానయ్య నిర్మాణంలోనే తన కొడుకు మొదటి సినిమా రాబోతున్నట్లు సమాచారం. ఇక RRR సినిమాకు సహాయక దర్శకుడిగా పని చేసిన మరో యువ దర్శకుడితో కూడా దానయ్య కొత్త సినిమాను తెరకెక్కించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక RRR సినిమా మార్చి 25వ తేదీన భారీ స్థాయిలో విడుదలవుతున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











