For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RRR షూటింగ్లో ఎన్టీఆర్ కంటికి గాయం.. ఆ వీడియోతో లీక్.. ఏమైందో చెప్పిన యూనిట్!

  |

  కేవలం తెలుగు ప్రేక్షకులు కాక భారతదేశం మొత్తం ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది ఆర్ ఆర్ అని చెప్పక తప్పదు.. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోగా అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ప్రకటించిన నాటి నుంచి భారీగా అంచనాలు నెలకొని ఉన్నాయి.. అయితే ఈ సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ కంటికి గాయం అయిందని ఆ గాయం గురించిన చర్చ నిన్నటి నుంచి జరుగుతూ వస్తుంది. ఆ విషయం మీద ఆర్ఆర్ఆర్ యూనిట్ క్లారిటీ ఇచ్చింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

  క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి గ్లామర్ లుక్స్.. నెవ్వర్ బిఫోర్ అనేలా బ్యూటీఫుల్ స్టిల్స్

  ఇద్దరు సూపర్ హీరోలు

  ఇద్దరు సూపర్ హీరోలు

  ప్రభాస్ హీరోగా బాహుబలి సినిమా తెరకెక్కించిన రాజమౌళి ఆ సినిమాతో ఎవరు ఊహించని సక్సెస్ అందుకున్నాడు. ఆ సినిమా భారత దేశంలోనే కాక వివిధ దేశాల్లో కూడా ప్రదర్శించబడి తెలుగు సినిమాలోని అత్యధిక కలెక్షన్లు సాధించిన మొట్టమొదటి సినిమాగా చరిత్రకెక్కింది.

  ఈ సినిమా తరువాత కొంచెం గ్యాప్ తీసుకున్న రాజమౌళి ఆ తర్వాత తెలుగు సినిమాకి సంబంధించి రెండు ముఖ్యమైన కుటుంబాలుగా చెప్పబడే నందమూరి కుటుంబం నుంచి నందమూరి తారక రామారావు, మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి ఆయన కుమారుడు రామ్ చరణ్ తేజ ఇద్దరితో కలిపి ఈ సినిమా ప్లాన్ చేశారు.

  భూమిక చావ్లా అస్సలు తగ్గట్లేదుగా.. 42లో కూడా అదే గ్లామర్!

  భారీ అంచనాలు

  భారీ అంచనాలు

  ఈ సినిమా అనూహ్యంగా ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.. ముందు టైటిలే ఫిక్స్ కాకపోవడంతో ముగ్గురు పేర్లలో మొదటి అక్షరాలతో ఆర్ ఆర్ ఆర్ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. అయితే ఈ టైటిల్ జనానికి బాగా నోట్ కావడంతో ఈ టైటిల్ నే ఫైనల్ చేసి దీనికి క్యాప్షన్ ఇచ్చే ప్రయత్నం చేశారు.

  ఇందులో భాగంగా ఐదు భాషలకు సంబంధించిన ఐదు విభిన్నమైన పేర్లతో ముందుకు వచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా పెద్ద వార్త అవుతుంది, మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సరిగ్గా రెండు మూడు రోజుల క్రితం ఎన్టీఆర్ రాజమౌళి ఐడి కార్డులు వేసుకుని ఉటున్నట్లుగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో విడుదల కాగా అవి విపరీతంగా వైరల్ గా మారాయి.

  రామ్ చరణ్ వీడియోతో

  రామ్ చరణ్ వీడియోతో

  అయితే నిన్న సాయంత్రం పొద్దుపోయాక రామ్ చరణ్ తేజ తన సోషల్ మీడియా ఖాతా నుంచి ఒక వీడియో విడుదల చేశారు. ఈ వీడియో విడుదల చేసి ఈ సెట్లో షూటింగ్ లేనప్పుడు మేము ఎలా గడుపుతాము అనేది చెప్పే ప్రయత్నం చేశారు. ఈ వీడియో లో ఎన్టీఆర్ రామ్చరణ్ సరదాగా ఒక ఫెన్సింగ్ లాంటి దాని మీద కూర్చుని ఉండగా రాజమౌళి కెమెరా లో నుంచి చూస్తున్నట్లుగా చూపించారు.

  అంతా బాగానే ఉంది కానీ ఈ వీడియోలో ఎన్టీఆర్ కంటి మీద గాయం అయినట్లు గా కాస్త కనిపిస్తోంది. నిజానికి ముందుగా ఈ చిన్న విషయాన్ని ఎవరూ అంతగా గుర్తించ లేదు. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ విషయాన్ని అబ్సర్వ్ చేసి అసలు ఏం జరిగింది అని సోషల్ మీడియా వేదికగా ఆర్ ఆర్ ఆర్ యూనిట్ ను ప్రశ్నించడం మొదలు పెట్టారు.

  అసలు ఏమైంది అంటే

  అసలు ఏమైంది అంటే

  ఇంకేముంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో కొంతమంది ఈ షూటింగ్ లో గాయమైందని అందుకే ఆ టైంలో ఎన్టీఆర్ ముఖానికి గాయం అయిందని కూడా పుకార్లు పుట్టించారు. ఈ విషయం మీద వెంటనే రంగంలోకి దిగింది ఆర్ ఆర్ ఆర్ యూనిట్. ఎన్టీఆర్ అభిమాని ఒకరు ఎన్టీఆర్ కంటికి ఏమైంది ? దాని మీద వివరణ ఇచ్చే ప్రయత్నం చేయండి అంటూ నేరుగా యూనిట్ ని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడంతో యూనిట్ ఈ అంశం మీద క్లారిటీ ఇచ్చింది.

  అది షూటింగ్ లో జరిగిన గాయం కాదని, పెట్టిన గాయం అంటూ క్లారిటి ఇచ్చింది. అంటే ఎన్టీఆర్ ఎలాంటి గాయాలు కాలేదు కానీ షూటింగ్ నిమిత్తం ఎన్టీఆర్ కంటికి గాయం అయినట్లు ఒక స్టిక్కర్ అతికించినట్లు తెలుస్తోంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ ఎన్టీఆర్ సేఫ్ అని షూటింగ్ కోసం ఎలా అతికించారని తెలిసి రిలాక్స్ అవుతున్నారు.

  RRR First Single Dosti Song Review | Filmibeat Telugu
  రాజమౌళికి కూడా నో ఎంట్రీ

  రాజమౌళికి కూడా నో ఎంట్రీ

  ఇక ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ ప్రస్తుతానికి ఉక్రెయిన్ దేశంలో జరుగుతుంది. ఇక దేశం కాని దేశం కావడంతో ఆ షూటింగ్ ప్రదేశంలో రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అనుమతి లేనిదే సినిమా హీరోకైనా లోపలికి ఎంట్రీ లేదని తెలుస్తోంది. అందుకే ముందు జాగ్రత్త చర్యగా హీరోహీరోయిన్ల సహా మొత్తం యూనిట్లోని లైట్ బాయ్ వరకు అందరికీ ఐడెంటి కార్డు ఇచ్చారని ఆ కార్డు లేకపోతే రాజమౌళికి అయినా లోపలికి ఎంట్రీ ఉండదని అంటున్నారు.

  లీకేజీల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న రాజమౌళి దేశం కాని దేశంలో కూడా ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేదని అందుకే ఈ మేరకు సన్నాహాలు చేశారని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమా అక్టోబర్ 13న దేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల థియేటర్లలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దసరా సీజన్ కావడంతో కచ్చితంగా సినిమా తమకు మరింత బూస్టప్ ఇచ్చే అవకాశం ఉందని రాజమౌళి భావిస్తున్నారు. చూడాల్సి ఉంది ఏం జరగబోతోంది అనేది

  English summary
  The discussion about the injury to the NTR eye during the shooting of the RRR movie has been going on since yesterday. The RRR unit gave clarity on the matter.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X