Nani: అంటే.. సుందరానికి అసలైన సమస్య.. అయినా తప్పట్లేదు?

నేచురల్ స్టార్ నాని ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక కొత్త తరహా పాయింట్ తో పాటు మంచి కామెడీ కూడా అందించాలని చూస్తూ ఉంటాడు. ముఖ్యంగా నాని నుంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. అతను ఎక్కువగా నిలదొక్కుకున్నది ఆ జానర్ లోనే కాబట్టి నాని ఎలాగైనా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే సినిమా చేయాలని చాలాకాలంగా ఎదురు చూస్తున్నాడు.

ఇక మొత్తానికి బ్రోచేవారెవరురా దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలోనే నటించినటువంటి 'అంటే.. సుందరానికి' మూవీ ఆ జానర్ లోనే తెరకెక్కింది. ఇటీవల షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా విడుదలకు కూడా సిద్ధమైంది. ఫుల్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'అంటే.. సుందరానికి' సినిమా పై అయితే ఓ వర్గం ప్రేక్షకులలో మంచి అంచనాలు ఉన్నాయి. తప్పకుండా సినిమా ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుంది అని చిత్ర యూనిట్ సభ్యులు కూడా చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తోంది.

Run time issue for nani ante sundaraniki movie

అయితే 'అంటే.. సుందరానికి' సినిమాకు ఒక అసలైన సమస్య హాట్ టాపిక్ గా మారినట్లుగా తెలుస్తోంది. అసలైన రన్ టైమ్ లో ఎంత కాదనుకున్నా కూడా మూడు గంటల పాటు ఆడియెన్స్ ను థియేటర్ లో ఉంచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సినిమా నిడివి అయితే 176 నిమిషాలు అని తెలుస్తోంది. అటు ఇటు గా చూసుకుంటే 3 గంటల పాటు ప్రేక్షకులను థియేటర్లో ఉండాల్సి వస్తుంది కాబట్టి ఈ తరహా రన్ టైమ్ రిస్క్ తో కుడుకున్నదే అని చెప్పవచ్చు. మూడు గంటలపాటు ప్రస్తుత రోజుల్లో ప్రేక్షకులను థియేటర్స్ లో కూర్చోబెట్టడం అంటే మామూలు ప్రయోగం కాదు.

అంతసేపు ఆడియన్స్ ను నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేస్తూనే ఉండాలి. కంటెంట్ లో ఏ మాత్రం తేడా వచ్చినా కూడా ఆడియన్స్ చిరాకుతో మధ్యలో నుంచి లేచి పోయే అవకాశం కూడా ఉంటుంది. కానీ అంటే సుందరానికి చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం సినిమా నాన్ స్టాప్ గా నవ్విస్తూనే ఉంటుంది అని ఎక్కడా బోర్ కొట్టకుండా ఉండేవిధంగా సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. మరి 'అంటే.. సుందరానికి' సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X