బాటిల్ క్యాప్ ఛాలెంజ్: రివర్స్ కిక్‌తో ఇరుగదీసిన కార్తీకేయ
ఐస్ బకెట్ ఛాలెంజ్, రైస్ బకెట్ ఛాలెంజ్ లాంటి తర్వాత ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన ఛాలెంజ్ బాటిల్ క్యాప్ ఛాలెంజ్. ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీలు తమ ఫిట్‌నెస్ ఎంటో చూపించేందుకు ఈ పోటీలో పాల్గొని అభిమానులను, నెటిజన్లను ఆకట్టుకొంటున్నారు. ఈ పోటీలో పాల్గొన్న వారిలో అర్జున్, అక్షయ్ కుమార్ తదితరులు ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో RX 100 హీరో కార్తీకేయ కూడా చేరారు.
ఏదైనా బాటిల్ మూతను చేతితో కాకుండా కాలితో కిక్ కొట్టి తీయాల్సి ఉంటుంది. ఆ పోటీలో బాటిల్ కింద పడకుండా కాలితో తన్ని మూతను తీయాలి. ఇప్పటికే ఈ ఛాలెంజ్‌ను బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, సౌత్ స్టార్ అర్జున్ సర్జా సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశారు. మరెందరో యువ హీరోలకు స్ఫూర్తిగా నిలిచారు. ప్రస్తుతం టాలీవుడ్ హీరో కార్తీకేయ కొట్టిన కిక్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. సోషల్ మీడియాలో కార్తీకేయ ఛాలెంజ్ వైరల్‌గా మారింది. కార్తీకేయ కిక్‌పై నెటిజన్లు జోరుగా స్పందిస్తున్నారు.

కార్తీకేయ కెరీర్ విషయానికి వస్తే.. గుణ 369 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అనిల్ కడియాల, అమిరెడ్డి తిరుమల్ రెడ్డి నిర్మాతలుగా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. చైతన్ భరద్వాజ్ సంగీతం, రామ్ రెడ్డి సినిమాటోగ్రఫిని అందించారు. కార్తీకేయ సరసన మలయాళి ముద్దుగుమ్మ అనఘా హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం ఆగస్టు 2వ తేదీన విడుదలకు ముస్తాబవుతున్నది.


Click it and Unblock the Notifications











