కార్తీకేయ న్యూ లుక్ అదుర్స్.. కేక పుట్టించిన RX100 హీరో!
RX 100 మూవీ సెన్సేషనల్ హిట్‌తో క్రేజీ హీరోగా మారిన కార్తీకేయ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. సినిమా సినిమాకు రేంజ్‌ను పెంచుకొంటూ వెళ్తున్న కార్తీకేయ న్యూ లుక్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. RX 100 మూవీ కోసం పొడవాటి జుత్తుతో మ్యాన్లీగా కనిపించాడు. ఇప్పుటు కురచగా హెయిర్ కట్ చేసి సాఫ్ట్ లుక్‌తో ఇరుగదీశాడు. గతంలో చూసిన రగ్గడ్ లుక్ భిన్నంగా కార్తీకేయ అమాయకంగా కనిపించడం ఆకట్టుకొన్నది.
RX 100 మూవీ తర్వాత ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న హిప్పీ చిత్రంలో నటిస్తున్నాడు. శ్రీలంక, తదితర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొంటున్నది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కలైపులి థాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రం సెట్స్‌పై ఉండగానే మరో చిత్రాన్ని పట్టాలెక్కించాడు కార్తీకేయ.

కార్తీకేయ నటిస్తున్న మరో చిత్రం ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని అనిల్ కడియాలా, తిరుమల్ రెడ్డి నిర్మిస్తుండగా, అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ సినిమాటోగ్రఫిని, చేతన్ మ్యూజిక్ అందిస్తున్నారు. త్వరలోనే ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూట్ ప్రారంభం కానున్నది.


Click it and Unblock the Notifications











