అమ్మాయిలతో డేటింగ్ చేసే టైమ్ లేదు... అంత అమాయకుడిని కాదు.. పాయల్ పక్కా.. RX 100 హీరో కార్తీకేయ

Recommended Video

'I Have Currently No Time To Date Any Girl' Says Karthikeya || Filmibeat Telugu

RX 100 మూవీ సక్సెస్ తర్వాత హీరో కార్తీకేయ పరిస్థితి ఊహించనంతగా మారిపోయింది. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థల్లో నటించే అవకాశాలు వెన్నుతట్టాయి. ప్రస్తుతం నాలుగు సినిమాలతో ఈ యువ హీరో బిజీగా మారిపోయారు. ప్రస్తుతం హిప్పీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సందర్బంగా ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆర్ఎక్స్ 100 హ్యాంగోవర్ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాను అని చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

ఓ రకంగా భయంగా

ఓ రకంగా భయంగా

RX 100 మూవీ సూపర్ హిట్ కావడం చాలా ఆనందంగా ఉంది. మరో రకంగా భయంగా ఉంది. నా రాబోయే సినిమాలు RX 100 కంటే పెద్ద సక్సెస్ అవుతాయని భావిస్తున్నాను. నటుడిగా నేను ఇంకా ఏంతో సాధించాలని అనుకొంటున్నాను. RX 100 ఇమేజ్ నుంచి బయటపడాలనుకొంటున్నాను అని కార్తీకేయ తెలిపాడు.

 నా మార్కు ఉండేలా పాత్రలతో

నా మార్కు ఉండేలా పాత్రలతో

నటుడిగా నా పాత్రలతో ప్రయోగాలు చేయాలనుకొంటున్నాను. RX 100 అంగీకరించిన ప్రతీ సినిమా ఒకదాని కంటే మరొకటి భిన్నమైంది. నా కంటే ఓ మార్కును క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. నానితో గ్యాంగ్ లీడర్ అనే చిత్రంలో నటిస్తున్నాను. ఆ చిత్రంలో విలన్‌గా కనిపిస్తాను అని కార్తీకేయ వెల్లడించాడు.

అందుకే RX 100 మూవీలో

అందుకే RX 100 మూవీలో

నేను రొటీన్‌గా పది మందిని కొట్టే హీరోగా తెలుగు తెరకు పరిచయం అయితే నన్ను చూడరు అనే విషయం నాకు తెలుసు. అందుకే RX 100 లాంటి చిత్రాన్ని మొదటి సినిమాగా ఎంచుకొన్నాను. ఇప్పుడు ఉన్న హీరోల కంటే భిన్నంగా ఉండాలని అనుకొనే వాడిని. ఆ రకంగా ఊహించి చేసిన సినిమానే RX 100. అది మంచి ఫలితాన్ని ఇచ్చింది అని కార్తీకేయ అన్నాడు.

 నేను అంత అమాయకుడిని కాదు

నేను అంత అమాయకుడిని కాదు

నిజ జీవితంలో RX 100 సినిమాలో కనిపించినంత అమాయకుడిని కాదు. హిప్పీ సినిమాలోని నా పాత్ర నా నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితిలో ఏ అమ్మాయితో డేటింగ్ చేసే అవకాశం లేదు. వరుసగా నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాను అని కార్తీకేయ అన్నాడు.

పాయల్ రాజ్‌పుత్‌తో లిప్ లాక్ గురించి

పాయల్ రాజ్‌పుత్‌తో లిప్ లాక్ గురించి

RX 100 సినిమాలో నాతో నటించిన పాయల్ రాజ్‌పుత్ పక్కా ప్రొఫెషనల్. ఆమెతో పనిచేయడం గొప్ప అనుభూతి, అనుభవానికి లోనయ్యాను. స్క్రిప్టు డిమాండ్ మేరకు లిప్‌లాక్‌లు ఉండటంతో మేమిద్దరం ఓ అవగాహనకు వచ్చి సన్నివేశాలను పండించాం అని కార్తీకేయ చెప్పాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X