అప్పుడు చిరంజీవి.. ఇప్పుడు నాని.. ఇన్సిపిరేషన్‌కు కేరాఫ్ అడ్రస్.. RX100 ఫేమ్ కార్తీకేయ
నేచురల్ స్టార్ నాని, వెర్సటైల్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్‌ల క్రేజీ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్(సివిఎం) నిర్మిస్తున్న విభిన్న చిత్రం 'నాని'స్ గ్యాంగ్ లీడర్'. టీజర్, ట్రైలర్‌తో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇటీవల విడుదల చేసిన ప్రమోషనల్ సాంగ్‌తో సినిమాకు మంచి బజ్ ఏర్పడింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా వైజాగ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి భారీగా అభిమానులు హాజరయి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో నటుడు కార్తికేయ మాట్లాడుతూ -

బ్యాక్ గ్రౌండ్ లేకుండా
నేచురల్ స్టార్ నాని గారికి మీ అందరితోపాటు గత పది సంవత్సరాలుగా మీ అందరి కన్నా ఎక్కువ ఫ్యాన్‌ని. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరో అవ్వాలనుకే వారికి ఇండస్ట్రీలో కొన్ని పేర్లు కనిపిస్తాయి అందులో మొదటిపేరు మెగాస్టార్ చిరంజీవి, తరువాత రవితేజ. అలా ప్రస్తుత కాలానికి మేమందరం ఇంట్లో గర్వంగా చెప్పుకునే పేరు నాని. ఆయన్ని ఏ విషయంలో నైనా ఇన్స్పిరేషన్‌గా తీసుకోవచ్చు అని కార్తీకేయ అన్నారు.

మిడిల్ క్లాస్‌లో పుట్టి
ఒక మామూలు మిడిల్ క్లాస్‌లో పుట్టి మన పక్కింటి అబ్బాయిలా టాలీవుడ్‌లో ఓ రేంజ్ స్థాయికి చేరుకున్నారు. 'ఎంసీఏ' లాంటి కమర్షియల్ మూవీ తర్వాత 'జెర్సీ' లాంటి డిఫరెంట్ మూవీ చేశారు. ప్రతీ విషయంలో నాని ఇన్సిపిరేషన్. నాకు బాగా ఇష్టమైన హీరోతో కలిసి నటించాను. నా జీవితంలో ఏ స్థాయికి వెళ్తానో తెలియదు కానీ.. గ్యాంగ్ లీడర్ సినిమా ఎప్పటికీ గుర్తుండి పోతుంది అని కార్తీకేయ అన్నారు.

గ్యాంగ్ లీడర్ చిత్రంలో నేను
గ్యాంగ్ లీడర్ సినిమాలో చేయడం ద్వారా నేను అసలు నటన ఏంటో తెలుసుకొన్నారు. దర్శకుడు విక్రమ్ నాతో బాగా చేయించారు. ఇప్పటి వరకు నేను నాని ఫ్యాన్‌గా మాట్లాడాను. ఇప్పుడు దేవ్ పాత్ర గురించి మాట్లాడాలి. నాకు మంచి పేరు తెస్తుంది. ఈ సినిమా చేయకపోతే నేను నిజంగా ఏదో మిస్ అయిపోయే వాడిని అని కార్తీకేయ అన్నారు.

విక్రమ్ కుమార్ గురించి
దర్శకుడు విక్రమ్ తీసిన మనం మనకు ఇంత ఇష్టమో. అలాంటి విక్రమ్ సర్ సినిమాలో నటించడం లక్ అనేది చిన్న మాట. 'గ్యాంగ్‌లీడర్' తరువాత నా నటన మారిపోయింది. అనిరుధ్ ఫీల్‌గుడ్ మ్యూజిక్ డైరెక్టర్. కొలవెరి సాంగ్‌తో ఖండాలు దాటారు. ఆయనతో కలిసి వర్క్ చేయడం హ్యాపీ. అలాగే మైత్రి మూవీస్‌లో 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్', 'రంగస్థలం' తరువాత 'గ్యాంగ్ లీడర్' నాలుగో బ్లాక్ బస్టర్ అవుతుంది అని కార్తీకేయ అన్నారు.

నటీనటులు, సాంకేతికవర్గం
నేచురల్ స్టార్ నాని, RX100 ఫేమ్ కార్తికేయ, ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్, జైజా, సత్య తదితరులు
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ (సివిఎం),
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విక్రమ్ కె.కుమార్
సంగీతం: అనిరుధ్ రవిచందర్,
సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్,
మాటలు: వెంకీ,
రచనా సహకారం: ముకుంద్ పాండే,
పొడక్షన్ డిజైనర్: రాజీవన్,
ఆర్ట్ డైరెక్టర్: రామ్‌కుమార్,
ఎడిటింగ్: నవీన్ నూలి,
వి.ఎఫ్.ఎక్స్.: మకుట,
కాస్ట్యూమ్ డిజైనర్: ఉత్తర మీనన్,
స్టిల్స్: జి.నారాయణరావు,
కో-డైరెక్టర్: కె.సదాశివరావు,
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: శేషు,
సీఈవో: చిరంజీవి (చెర్రీ),


Click it and Unblock the Notifications











