నాగార్జున గురించి వారు తప్పుగా చూపిస్తున్నారా?: ‘ఆర్ఎక్స్ 100’ కార్తికేయ
'ఆర్ఎక్స్ 100' మూవీ స్టార్ కార్తికేయ తాజాగా తన ట్విట్టర్లో అక్కినేని నాగార్జున గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "వికీపీడియా ఏమైనా తప్పు చూపిస్తోందా? ఈ మనిషి వయసు 59 అని చెబుతోంది.'' అంటూ కామెంట్స్ చేశారు. నాగార్జున నటించిన 'దేవదాస్' మూవీ చూసిన అనంతరం కార్తికేయ ఈ వ్యాఖ్యలు చేశారు.
'దేవదాస్' మూవీలో నాగార్జున షర్ట్ లెస్ లుక్‌కు సంబంధించిన ఫోటో పోస్టు చేసిన అనంతరం.... కార్తికేయ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన తన ఫిట్ నెస్‌తో ఇతర యాక్టర్లకు నాగ్ సర్ ఛాలెంజ్ విసురుతున్నారు. ఏమున్నారు బాబు... అంటూ తన మనసులోని మాటను బయట పెట్టాడు ఈ యంగ్ హీరో.

నాగార్జున, నాని ప్రధాన పాత్రల్లో శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశ్వినీదత్ నిర్మించిన 'దేవదాస్' మూవీ శుక్రవారం విడుదలై బాక్సాఫీసు వద్ద డిసెంట్ టాక్ తెచ్చుకుంది. ఇందులో దేవ అనే డాన్ పాత్రలో నాగార్జున, దాస్ అనే డాక్టర్ పాత్రలో నాని నటించారు.
'ఆర్ఎక్స్ 100' సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడంతో ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయిన కార్తికేయకు వరుస అవకాశాలు వస్తున్నాయి. పలువురు ఫిల్మ్ మేకర్స్ విభిన్నమైన కథలతో ఈ యంగ్ హీరోను అప్రోచ్ అవుతున్నారు. ఈ సినిమా తర్వాత 'హిప్పి' అనే అనే సినిమాకు కమిటైన కార్తికేయ తాజాగా మరో మూవీకి కమిట్ అయ్యాడు.
ఈ సినిమా రెజ్లింగ్ బ్యాక్ డ్రాప్‌తో ఉంటుందని, కథ సైతం ఆసక్తికరంగా ఉంటుందని. తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు రాని ఒక కొత్త తరహా స్క్రీన్ ప్లేతో ఈ మూవీ ఉండబోతోందని అంటున్నారు. వెంకట్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ మూవీని ఎం.ఎస్ రెడ్డి స్టూడియోస్ వారు నిర్మించబోతున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











