హీరోగా ఎదుగుతున్న వేళ ‘ఆర్ఎక్స్ 100’ కార్తికేయ సాహసం!

'ఆర్ఎక్స్ 100' సినిమా ద్వారా హీరోగా పరిచయమైన కార్తికేయ తొలి చిత్రంతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మూవీ విజయం అందుకోవడంతో కార్తికేయకు హీరోగా వరుస ఆఫర్స్ వస్తున్నాయి. అయితే ఇలాంటి సమయంలో ఎవరైనా హీరో పాత్రలు చేయడానే ఆసక్తిచూపుతారు. కెరీర్ ప్రారంభంలోనే నెగెటివల్ రోల్స్ చేసే సాహసం చేయరు.

నాని హీరోగా రూపొందుతున్న చిత్రంలో కార్తికేయ నెగెటివ్ రోల్ చేయడానికి కమిట్ అవ్వడం చర్చనీయాంశం అయింది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. ప్రారంభోత్సవ వేడుకలో కార్తికేయ కూడా పాల్గొన్నారు.

RX100 Karthikeya seen as a car racer in Nani, Vikram Kumar film

ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇందులో కార్తికేయ కార్ రేసర్‌గా కనిపించబోతున్నారని, ఫుల్ ఫ్లెడ్జ్ నెగెటివ్ షేడ్స్‌తో ఈ పాత్ర ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ పాత్ర కేవలం విలన్ పాత్ర కాదని... నటుడిగా తనను తాను నిరూపించుకునే అద్భుతమైన పాత్ర కావడం వల్లనే కార్తికేయ ఒప్పుకున్నట్లు సమాచారం.

మైత్రి మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ పని చేస్తున్నారు. నాని సరసన మలయాళి భామ ప్రియాంక ఆరుల్‌మోహన్ నటిస్తోంది. ఒక డిఫరెంట్ లవ్ స్టోరీగా ఈ చిత్రం ఉంటుందని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X