twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    100 కోట్ల లాభం వదిలేసుకున్నారు: ‘సాహో’ ఈవెంట్లో ప్రభాస్ అదిరిపోయే స్పీచ్

    |

    ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'సాహో' మరో పది రోజుల్లో(ఆగస్టు 30) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాహుబలి 2 తర్వాత దాదాపు రెండేళ్లు వెయిట్ చేసిన అభిమానుల నిరీక్షణకు తెరపడే సమయం ఆసన్నమైంది. దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ భారీ చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా అదే స్థాయిలో నిర్వహిస్తున్నారు.

    ఇందులో భాగంగా ఆదివారం(ఆగస్టు 18) హైదరాబాద్‌లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా ప్రభాస్ ... సినిమాలో వాడిన వస్తువులు, వాహనాలు మీ కోసం ప్రదర్శనకు పెట్టాం. మీకు నచ్చింది అనుకుంటున్నాను అంటూ తన ప్రసంగం మొదలు పెట్టారు.

    Photo Gallery: 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్

    సుజీత్‌కు మాస్ పల్స్ బాగా తెలుసు

    సుజీత్‌కు మాస్ పల్స్ బాగా తెలుసు

    సినిమాలో ఫ్యాన్స్.. డై హార్డ్ ఫ్యాన్స్ అని రాసింది సుజీతే... అతడికి మాస్ పల్స్ ఎలా ఉంటుందో తెలుసు. మన సినిమాకు మది, సాబు సర్, శ్రీకర్ సర్, కమల్ సర్ లాంటి పెద్దవారు పని చేశారు. జిబ్రన్ అందించిన సౌండ్‌కు సూపర్ అప్లాజ్ వచ్చింది. మా సినిమాలో భాగమైనందుకు జాకీ ష్రాఫ్‌కు థాంక్స్. ఆయనతో ఎప్పటి నుంచో పని చేయాలనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. చాలా స్వీట్ పర్సన్.

    అనిల్ తడాని సాహోకు ఎంత ఇంపార్టెంట్ అంటే...

    అనిల్ తడాని సాహోకు ఎంత ఇంపార్టెంట్ అంటే...

    ‘సాహో'కు అనిల్ తడాని చాలా ముఖ్యం. బాహుబలి 1 డిస్ట్రిబ్యూటర్.. అప్పటి నుంచి పరిచయం. అనిల్ సాహోకు ఎంత ఇంపార్టెంట్ అంటే... ఫస్ట్ డే నుంచి సపోర్ట్ చేశారు. ప్రతి దాంట్లో ఆయన వెనక ఉండి హెల్ఫ్ చేశారు. ఈ సినిమాతో మా ఫ్యామిలీలో భాగం అయ్యారు. టి సిరీస్ భూషణ్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు.

    సుజీత్ గ్రేటెస్ట్ డైరెక్టర అయిపోతాడు

    సుజీత్ గ్రేటెస్ట్ డైరెక్టర అయిపోతాడు

    సుజీత్ ఫస్ట్ కథ చెప్పినపుడు నిక్కరేసుకుని వచ్చాడు. అపుడు అతడి వయసు 24 సంవవత్సరాలు. మన యువి ప్రొడక్షన్లో రన్ రాజా రన్ చేశాడు. అపుడు అతడి వయసు 22 సంవత్సరాలు. ‘సాహో' మొదలవ్వడానికి ముందు చాలా ప్రీ వర్క్ చేశాడు. షూటింగ్ మొదలైనపుడు అందరూ పెద్ద టెక్నీషియన్లే... సాబు సర్, మది సర్, కమల్ సర్, శ్రీకర్ సర్... ఎలా హ్యాండిల్ చేస్తాడో అని ప్రమోద్, మేము కంగారు పడ్డాం. కానీ ఒక్కరోజు కూడా సమస్య రాలేదు. ఇంత మందిని హ్యాండిల్ చేసిన విధానానికి గ్రేటెస్ట్ డైరెక్టర్ అయిపోతాడేమో అనిపిస్తుంది. ఇంటర్నేషనల్ లెవల్‌కు వెళతాడేమో అనిపిస్తుంది.

    శ్రద్ధా కపూర్ దొరకడం మా అదృష్టం

    శ్రద్ధా కపూర్ దొరకడం మా అదృష్టం

    శ్రద్ధా కపూర్ 2 సంవత్సరాలు ఈ సినిమాలో పని చేసింది. అన్ని రోజులు పని చేయడం అంటే మామూలు విషయం కాదు. ఒక నటి రెండు సంవత్సరాలు బాంబే నుంచి వచ్చి పని చేయడం గ్రేట్. ఒక్క రోజు కూడా ఆమెతో సమస్య లేదు. చాలా సపోర్టివ్. అలాంటి వ్యక్తి సాహోలో ఉండటం మేము లక్కీగా ఫీలవుతున్నాం. ఆమె సూపర్ పెర్ఫార్మర్, యాక్షన్ సీన్లు ఇరగదీసింది.

    రూ. 100 కోట్ల లాభం వదిలేసుకుని చేశారు

    ఎలాగైనా సంవత్సరానికి రెండు సినిమాలు చేసి మిమ్మల్ని ఎంటర్టెన్ చేస్తాను అనుకున్నాను. ఈ సారి మాట ఇవ్వకుండా చేయాలి అనుకుంటున్నాను. ప్రమోద్, వంశీ, విక్కీ గురించి చెప్పాలి. ఈ సినిమా జాగ్రత్తగా చేసి ఉంటే 100 కోట్ల లాభం వచ్చేది. ఆ వంద కోట్ల ప్రాఫిట్ వదిలేసుకుని ఈ సినిమాకు అలా ఖర్చుపెట్టేశారు. నా ఫ్రెండ్స్ గురించి చెప్పడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉండాలి. మన అందరికీ అలాంటి ఫ్రెండ్స్ ఉండాలి... అని ప్రభాస్ వ్యాఖ్యానించారు.

    సాహో

    సాహో

    యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ఏ-విక్ర‌మ్ లు ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. న‌టీన‌టులు.. రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్, శ్రధ్ధాక‌పూర్‌, జాకీష‌ర‌ఫ్, నీల్ నితిన్ ముఖేష్‌, అరుణ్ విజ‌య్‌, లాల్‌, వెన్నెల కిషోర్‌, ప్ర‌కాష్ బెల్వాది, ఎవిలిన్ శ‌ర్మ‌, చుంకి పాండే, మందిరా బేడి, మ‌హేష్ మంజ్రేఖ‌ర్‌, టిను ఆనంద్‌, శ‌ర‌త్ లోహిత‌ష్వా త‌దిత‌రులు..

    English summary
    Saaho Pre Release Event LIVE Coverage. Saaho Pre Release Event Prabhas speech. Saaho is a Multi-Lingual Indian Movie ft. Rebel Star Prabhas and Shraddha Kapoor. Directed by Sujeeth and Produced by Vamsi and Pramod under UV Creations.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X