twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సాహో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ.. ఇండియన్ తెరపై క్రేజీగా.. ఒక్క సీన్ కోసం ఎన్ని కోట్ల ఖర్చంటే

    |

    బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జాతీయ నటుడిగా మారారు. బాహుబలి తర్వాత ఆయన నటించిన సినిమాలకు దేశవ్యాప్తంగా ఆదరణ దక్కుతున్నది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సాహో చిత్రం విడుదలకు సిద్ధమవుతున్నది. రిలీజ్‌కు ముస్తాబవుతున్న ఈ చిత్రం అనేక విశేషాలతో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతున్నది. ఈ సందర్భంగా సాహో గురించిన ఓ వార్త మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. ఈ సినిమా గురించి సినిమాటోగ్రాఫర్ మాదీ చెప్పిన విషయాలు ఏమిటంటే..

    టాక్ ఆఫ్ ది ఇండియన్ ఇండస్ట్రీ

    టాక్ ఆఫ్ ది ఇండియన్ ఇండస్ట్రీ

    ఇప్పటికే సాహో చిత్రం కోసం అబుదాబీలో ప్రభాస్‌పై చిత్రీకరించిన సన్నివేశాలు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను షేడ్స్ ఆఫ్ సాహోగా రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్‌లో స్పష్టంగా కనిపించిన సన్నివేశాలు హాలీవుడ్ సినిమాను తలపించేలా ఉన్నాయనే మాట వినిపించింది.

    ఎనిమిది నిమిషాలు కోసం 70 కోట్లు

    ఎనిమిది నిమిషాలు కోసం 70 కోట్లు

    అబుదాబీలో చిత్రీకరించిన సన్నివేశాల గురించి సినిమాటోగ్రఫర్ మాదీ మాట్లాడుతూ. సాహో అద్భుతమైన సైంటిఫిక్ థ్రిల్లర్. ప్రతీ సన్నివేశం ప్రేక్షకుల వెన్నులో చలిపుట్టించేలా ఉంటాయి. ఓ యాక్షన్ సీన్‌ను రూ.70 కోట్లతో చిత్రీకరించాం. దాదాపు ఆ సన్నివేశం నిడివి ఎనిమిది నిమిషాలు ఉంటుంది. ఇప్పటి వరకు దక్షిణాదిలోనే కాకుండా.. ఇండియన్ స్క్రీన్‌పై నభూతో నభవిష్యత్‌గా ఉంటుంది అని మాదీ చెప్పారు.

     ప్రభాస్ యాక్షన్ సీన్లు క్రేజీగా

    ప్రభాస్ యాక్షన్ సీన్లు క్రేజీగా

    సాహో సినిమాలో ప్రతీ యాక్షన్ సీన్ అద్భుతంగా ఉంటుంది. కెన్నీ బేట్స్ డిజైన్ చేసిన యాక్షన్ సీన్లు అద్భుతంగా ఉంటాయి. అద్భుతమైన ఆకాశా హార్మ్యాలపై నుంచి ప్రభాస్ దూకే సన్నివేశాలు షాకింగ్‌గా ఉంటాయి. ఛేజింగ్ సీన్లు సినిమాకే హైలెట్. ప్రేక్షకుడికి ఈ సినిమా మరో చక్కటి అనుభూతిని కలిగిస్తుంటుంది అని మాదీ చెప్పారు.

    రూ.300 కోట్లతో సాహో సినిమా

    రూ.300 కోట్లతో సాహో సినిమా

    సాహో చిత్రం రూ.300 కోట్లకుపైగా బడ్జెట్‌తో రూపొందుతున్నది. గతేడాది దుబాయ్ బుర్జ్ ఖలీఫా వద్ద తెరకెక్కించిన యాక్షన్ సీన్ల కోసమే రూ.100 కోట్లకుపైగా ఖర్చు చేసినట్టు వార్తలు వచ్చాయి. కేవలం ఇంటర్వెల్ సీన్ కోసమే రూ.30 కోట్లు ఖర్చు చేశారనేది సినీ వర్గాలు టాక్. నేషనల్ ప్రాజెక్ట్‌గా రూపొందిన ఈ చిత్రంలో బాలీవుడ్‌కు చెందిన శ్రద్ధాకపూర్, మందిరాబేడి, నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్ తదితరులు నటిస్తున్నారు.

    మూడు భాషల్లో రూ.300 కోట్లతో

    మూడు భాషల్లో రూ.300 కోట్లతో

    తెలుగు, తమిళ, హిందీ మూడు భాషల్లో రూపొందే సాహో చిత్రంలో శ్రద్దాకపూర్, నీల్ నితిన్ ముఖేష్, ఎవ్లీన్ శర్మ, జాకీ ష్రాఫ్, మందిరాబేడి తదితరులు నటిస్తున్నారు. సుజిత్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ వాయిదా పడినట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదంటూ సినిమా వర్గాలు వెల్లడించాయి.

    English summary
    Saaho producet spends Rs.70 crores for eight minutes. Reports suggest that, the makers of Saaho shelled out Rs 70 crore on an action sequence that was shot in Abu Dhabi.Fans are waiting with bated breath for the release of Sujeeth's ambitious directorial venture Saaho, which is touted to be one of the slickest action-thrillers that the country has ever seen.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X