ప్రభాస్ బర్త్ డే రోజు అభిమానులకు డబుల్ ధమాకా!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి బాహుబలి తరువాత మరో చిత్రం రాలేదు. బాహుబలి 2 తరువాత భారీ గ్యాప్ ఏర్పడింది. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ లో సాహో చిత్రం తెరకెక్కుతుండడంతో ఆలస్యం జరుగుతోంది. దీనితో ప్రభాస్ అభిమానులకు నిరీక్షణ తప్పడం లేదు. ఇటీవల ప్రభాస్ మరో చిత్రాన్ని కూడా ప్రారంభించాడు.
జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శత్వంలో ప్రభాస్ కొత్త చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. అక్టోబర్ 23 న ప్రభాస్ జన్మదిన వేడుక జరగనుంది. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు డబుల్ ధమాకా అందించబబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సాహో చిత్ర టీజర్ ని ప్రభాస్ పుట్టినరోజు నాడు విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అదే సమయంలో రాధాకృష్ణ దర్శత్వంలో రూపొందే చిత్రానికి సంబంధించి కూడా సర్ ప్రైజ్ ఉన్నట్లు తెలుస్తోంది. రాధాకృష్ణ దర్శత్వం వహిస్తున్న చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక సాహో చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











