కంచె తరువాత వరుణ్ మళ్ళీ.. నిజాం కాలం నాటి కథతో!
మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం దర్శకుల కు మోస్ట్ వాంటెండ్ హీరో. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోగలనని వరుణ్ ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఫిదా, తొలి ప్రేమ చిత్రాలతో వరుణ్ తేజ్ వరుస సూపర్ హిట్స్ సొంతం చేసుకుని జోరుమీద ఉన్నాడు. ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ అంతరిక్షం చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతరిక్ష పరిశోధనకు సంబందించిన అద్భుత అంశాలతో ఈ చిత్రం రూపొందుతోంది.
వరుణ్ తదుపరి చిత్రం గురించి ఆసక్తికర ప్రచారం మొదలైంది. అప్పట్లో ఒకడుండేవాడు చిత్రాన్ని తెరకెక్కించిన సాగర్ చంద్ర వరుణ్ కోసం ఆసక్తికరమైన పీరియాడిక్ లవ్ స్టోరీ సిద్దంచేసినట్లు తెలుస్తోంది. వరుణ్ కూడా ఈ చిత్రానికి అంగీకారం తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి.

నిజాం కాలం నాటి ప్రేమ కథగా ఈ చిత్రం ఉంటుందట. ఇప్పటికే వరుణ్ తేజ్ కంచె చిత్రంతో పీరియాడిక్ డ్రామాలో నటించాడు. అంతరిక్షం చిత్రం విడుదలయ్యాక సాగర్ చంద్ర దర్శత్వంలో చిత్రం ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











