పవన్-అలీ వివాదంపై... మెగా మేనల్లుడి అమాయకత్వం!
పవన్ కళ్యాణ్, అలీ వివాదం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయింది. స్నేహితులుగా ఉన్న వీరి మధ్య రాజకీయ కారణాలు చిచ్చు పెట్టడం చూసి అంతా విస్తుపోయారు. ఇది ఎన్నికల జిమ్మిక్కులు అంటూ కొందరు విమర్శించారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్-అలీ మధ్య దూరం పెరిగింది.
'అలీని స్నేహితుడిగా ఎంతో నమ్మాను, సాయం చేశాను, కానీ నాకు నమ్మక ద్రోహం చేశాడు' అంటూ పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ ఆరోపణలు చేయగా... అలీ కూడా ఏమాత్రం తగ్గకుండా కౌంటర్ ఇచ్చారు. 'మీరు మీ అన్నయ్య చిరంజీవి సాయంతో పైకొచ్చారు... నేను ఎవరి సాయం లేకుండా సొంతగా కష్టపడి ఈ స్థాయికి వచ్చాను, మీరు నాకు ఎప్పుడు సాయం చేశారు?' అంటూ ఎదురు ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

మెగా మేనల్లుడి అమాయకత్వం!
తన తాజా చిత్రం ‘చిత్రలహరి' మూవీ ప్రమోషన్లో బిజీగా ఉన్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌కు... పవన్ కళ్యాణ్- అలీ వివాదం గురించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనికి సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ.. ‘నాకు అసలు గొడవ జరిగినట్లు తెలియదు, నేను టౌన్లో లేను. దాని గురించి తెలియకుండా మాట్లాడటం కరెక్ట్ కాదు' అంటూ అమాయకంగా సమాధానం ఇచ్చారు.

ఆ విషయమే నాకు తెలియదండీ
మీ మామయ్య నాగబాబుగారు యూట్యూబ్‌లో ‘నా ఛానల్ నా ఇష్టం' పేరుతో చేసిన వీడియోలు చూశారా? అని ప్రశ్నించగా... ‘లేదండీ, అలాంటి ఒక ఛానల్ ఉందనే విషయం కూడా నాకు తెలియదు' అంటూ మరింత అమాయకంగా ఆన్సర్ ఇచ్చారు ఈ సుప్రీం హీరో.

బాలయ్యపై నాగబాబు కామెంట్లపై
మీరు నటించిన ‘ఇంటిలిజెంట్' టీజర్ బాలకృష్ణ లాంచ్ చేశారు. ఆయనతో మీకు మంచి రాపో కూడా ఉంది. రీసెంటుగా నాగబాబు గారు బాలకృష్ణ మీద కామెంట్స్ చేశారు చూశారా? అనే ప్రశ్నకు సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ... ‘చూశాను కానీ, వాటి గురించి నాకు అవగాహన లేదు. ఎందుకన్నారో, ఏమన్నారో నాకు తెలియదు. ఆ కామెంట్స్ గురించి తెలియనపుడు సపోర్ట్ చేయడం, ఖండించడం లాంటివి చేయలేను' అని స్పష్టం చేశారు.

నా మద్దతు ఎప్పుడూ కళ్యాణ్ గారికే
నేను జనసేన ప్రచారంలో పాల్గొనక పోవడానికి కారణం ‘చిత్రలహరి' బిజీలో ఉండటమే. నా మద్దతు ఎప్పుడూ కళ్యాణ్ గారికి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. జనసేన పార్టీ రాక ముందు తనకు ఏ పార్టీపై ఇంట్రస్ట్ లేదని స్పష్టం సాయి ధరమ్ తేజ్ స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications











