‘‘ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా... సాయి ధరమ్ తేజ్ సినిమా చూసి మారిపోయాను’’

సాయి ధరమ్ తేజ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన మూవీ 'చిత్రలహరి'. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. వరుసగా 6 ప్లాపుల తర్వాత సాయి ధరమ్ తేజ్ సక్సెస్ చూశాడు.చిత్రలహరి వరల్డ్ వైడ్ రైట్స్ రూ. 12.80 కోట్లకు అమ్మగా... ఫుల్‌రన్‌లో రూ. 14.57 కోట్ల షేర్ వసూలు చేసింది. సినిమా విడుదలైన తొలి వారాంతంలోనే రూ. 9.35 షేర్ వసూలవ్వగా ఓవరాల్ రనల్‌లో మంచి వసూళ్లు సాధించింది.

'చిత్రలహరి' మూవీ తాజాగా అమేజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. సినిమా చూసిన ఫ్యాన్స్ ప్రశంసలు గుప్పించారు. దీనిపై సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ... 'ఇప్పుడు నేను విభిన్నమైన భావోద్వేగంలో ఉన్నాను. మీ ట్వీట్స్ చూస్తుంటే 'చిత్రలహరి' ఈ వారాంతమే విడుదలైనట్లు ఉంది. ప్రేక్షకులు సినిమా చూసి రివ్యూ ఇస్తుండటం ఆనందంగా ఉంది. పైరసీ ఎంకరేజ్ చేయకుండా అమేజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చే వరకు వెయిట్ చేసినందుకు థాంక్స్'' అంటూ ట్వీట్ చేశారు.

Sai Dharam Tej about Chitralahari amazon prime release

మరో అభిమాని స్పందిస్తూ... నాకు సక్సెస్ లేక సూసైడ్ చేసుకునే స్టేజికి వచ్చాను. ఈ మూవీ చూసిన నా నిర్ణయం మార్చుకున్నట్లు తెలిపారు. ఈ ట్వీట్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సాయిధ‌ర‌మ్‌తేజ్‌, క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్, నివేథా పేతురాజ్‌ హీరో హీరోయిన్స్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్ర‌సాద్‌, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్ర‌కాశ్‌, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్ర‌ఫీ: కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X