షాక్ కు నోట మాట రాలేదు.. బాధపడుతుంటే 90 వేశావా అన్నారు.. సాయి ధరమ్ తేజ్ కామెంట్స్
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే మంచి ఇమేజ్ సంపాదించుకున్నాడు సాయి ధరమ్ తేజ్. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా పలు విభాగాల్లో అదరగొట్టి సుప్రీమ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అనేక చిత్రాల్లో నటించి సాయి ధరమ్ తేజ్ కు హిట్ అందించిన చిత్రాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. అయినా పట్టువిడకుండా ఆద్యంతం ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నిస్తున్నాడు హీరో. ప్రస్తుతం విరూపాక్ష సినిమాతో రానున్న సాయి ధరమ్ తనకు జరిగిన బైక్ యాక్సిడెంట్ తర్వాత ఫేస్ చేసిన సమస్యలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

షూటింగ పూర్తి..
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ 15వ చిత్రంగా వస్తున్న చిత్రం 'విరూపాక్ష'. ఈ సినిమాతో కార్తీక్ వర్మ దండు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో విభిన్నమైన కథతో రూపొందుతోంది. ఇదివరకు విడుదలైన మూవీ గ్లింప్స్ ఎంతో ఆకట్టుకున్నాయి. సుకుమార్ రైటింగ్స్, శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర సంస్థలు నిర్మిస్తున్న సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది.

ప్రమాదం జరిగి బాధలో ఉంటే..
ఇదిలా ఉంటే రిపబ్లిక్ సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ కు హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జీ వద్ద బైక్ యాక్సిడెంట్ జరిగిన విషయం తెలిసిందే. దీంతో తర్వాత సినిమాలు చేయడం ఆలస్యమైంది. ఇప్పుడు వీరుపాక్ష మూవీతో ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు ప్రమాదం జరిగినప్పుడు తను బాధలో ఉంటే ఇతరులు ఎలాంటి జోకులు వేసేవారో తెలిపాడు సాయి ధరమ్ తేజ్. ఇప్పుడు ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తాగేసి మాట్లాడుతున్నాడా..
"యాక్సిడెంట్ జరిగిన తర్వాత నాకు మాట విలువ ఏంటో తెలిసింది. యాక్సిడెంట్ అయినప్పుడు నేను షాక్ కు గురయ్యాను. దాంతో నా మాట పడిపోయింది. జనాలకు ఆ విషయం తెలియదు. నేను అప్పుడు మాట్లాడుతుంటే వీడేంటి తాగేసి మాడ్లాతున్నాడా అని జోకులేసుకున్నారు. కానీ మాట తిరిగి రావటం కోసం ఎంత బాధపడ్డానో నాకు తెలుసు" అని సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తెలిపాడు.

చాలా ఓపికగా వినేవాళ్లు..
"చిన్నప్పటి నుంచి నేను తెగ మాట్లాడేవాన్ని. ఈ కారణంగా నేను క్లాస్ బయటే ఉండేవాన్ని. సడెన్ గా మాట పడిపోయినప్పుడు దాని విలువ ఏంటో తెలిసింది. మాట్లాడటం అనేది ఎంత సంతోషాన్నిస్తుందో తెలుసుకున్నాను. మాట వచ్చే క్రమంలో నా పక్కనుండే వాళ్లు ఎంతో సపోర్ట్ చేశారో నాకు తెలుసు. నేను మాట్లాడటానికి కష్టపడుతుంటే చాలా ఓపికగా వినేవాళ్లు. సినిమాల్లో నా తోటి నటీనటులు, నటీమణులు చాలా సపోర్ట్ చేశారు" అని సాయి ధరమ్ తేజ్ పేర్కొన్నాడు.

హాఫ్ పేజీ డైలాగ్ కి..
"రిపబ్లిక్ సినిమాలో 4 పేజీల డైలాగ్ ను అవలీలగా చెప్పేవాన్ని. అలాంటిది సడెన్ గా హాఫ్ పేజీ డైలాగ్ కే మాట వచ్చేది కాదు. మాట రోల్ అయ్యేది. అది నాతోటి నటీనటులు అర్థం చేసుకున్నారు. ఆఖరికి మా గురువు గారు కల్యాణ్ గారు నువ్వేక్కువ ఇబ్బంది పడకు. పర్లేదు అన్నారు. డైలాగ్స్ చెప్పేటప్పుడు మైమ్ చేయమని అనేవారు. దానివల్ల నాలో తెలియని ఓ కాన్ఫిడెన్స్ వచ్చింది" అని సాయి ధరమ్ తేజ్ వెల్లడించాడు.

పట్టించుకునే వాన్ని కాదు..
సాయి ధరమ్ తేజ్ ఇంకా కొనసాగిస్తూ.. "అప్పుడే తెలిసిందే వాల్యూ ఆఫ్ స్పీచ్. కొంతమంది అన్నారు.. ఏంటీ 90 వేసుకుని వచ్చావా. ఏటీ మాట పోయింది. వాళ్లకేం తెలుసు నా బాధ. అలా అన్నోళ్లను నేను పట్టించుకునే వాన్ని కాదు. నాకు నేను ఎలా డెవలప్ కావాలనే దానిపై ఫోకస్ చేసుకుంటూ వచ్చాను. నా యాక్టింగ్ నాకు నేనుగా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నిస్తూ వచ్చాను" అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











