అమ్మా నాన్న విడాకులపై స్పందించిన సాయి ధరమ్ తేజ్, ఏం జరిగిందంటే?

Recommended Video

Sai Dharam Tej About His Parents Divorce || Filmibeat Telugu

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ జీవితంలో చాలా మందికి తెలియని ఒక సాడ్ పార్ట్ ఉంది. దాదాపు పదిహేనేళ్ల క్రితమే వాళ్ల అమ్మానాన్న విడిపోయారు. అప్పటి నుంచి వాళ్ల అమ్మగారే అన్నీ తానై సాయి ధరమ్ తేజ్, అతడి సోదరుడిని పెంచారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తేజ్ ఈ విషయంపై స్పందించారు.

''వారు కలిసి ఉండటం కుదరలేదు. వారి నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. అది జరిగిపోయి 15 సంవత్సరాలైపోయింది. నేను 10వ తరగతిలో ఉన్నపుడే విడాకులు తీసుకున్నారు. అదంతా గతం. దాని గురించి మరిచిపోయి జీవితాన్ని ముందుకు సాగించాం'' అని తెలిపారు.

నాన్నతో టచ్‌లో ఉన్నాను

నాన్నతో టచ్‌లో ఉన్నాను

‘‘మా నాన్నతో టచ్ లో ఉంటాను. ఇద్దరి మధ్య రిలేషన్ వావ్ అనేలా ఉందని చెప్పలేను కానీ గుడ్ రిలేషన్ అని చెప్పగలను. ఆయన సినిమా రంగానికి చెందిన వ్యక్తి కాదు కాబట్టి ఈ విషయాలు అర్థం కావు కాబట్టి సలహాలు లాంటివి ఏమీ ఇవ్వరు.'' అని సాయి ధరమ్ తేజ్ తెలిపారు.

అమ్మే నాన్న.. ఆ లోటు తెలియకుండా

అమ్మే నాన్న.. ఆ లోటు తెలియకుండా

‘‘అమ్మా నాన్న విడాకుల వల్ల జీవితంలో ఏదో మిస్సయ్యాను అనే ఫీలింగ్ ఎప్పుడూ రాలేదు. ఆ లోటు తెలియకుండా మా అమ్మ నన్ను, తమ్ముడిని పెంచింది. నాకు అమ్మే నాన్న.. నాన్నే అమ్మ. తల్లి, తండ్రి ఇలా అన్ని బాధ్యతలు తానే నిర్వర్తించింది.'' అని తేజ్ చెప్పుకొచ్చారు.

2011లో అమ్మ మరో పెళ్లి చేసుకున్నారు

2011లో అమ్మ మరో పెళ్లి చేసుకున్నారు

‘‘అమ్మ 2011లో మరో పెళ్లి చేసుకున్నారు. నేను అప్పుడే ఇండస్ట్రీకి వచ్చాను. ఈ వయసులో ఆమెకు ఒక తోడు అవసరం అని మేము భావించాము. తోడు అనేది లేకుంటే ప్రపంచం లోన్లీగా ఉంటుంది. ప్రతి ఒక్కరికీ తోడు అనేది అవసరమే. మేము ఉన్నప్పటికీ రేపు మా మ్యారేజ్ అయిన తర్వాత ఆమెకు ఒక లోన్లీనెస్ వస్తుంది కాబట్టే అంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం.'' అని తెలిపారు.

స్టెప్ ఫాదర్ గురించి

స్టెప్ ఫాదర్ గురించి

‘‘స్టెప్ ఫాదర్‌తో మా రిలేషన్ బావుంటుంది. ఆయన చాలా మంచి వ్యక్తి, మాతో చాలా కంఫర్టుగా ఉంటారు. ఆయన ఒక డాక్టర్. కేర్ ఆసుపత్రిలో పని చేస్తున్నారు. ఆప్తమాలజిస్ట్... కంటికి సంబంధించిన వైద్యుడు'' అని సాయి ధరమ్ తేజ్ వెల్లడించారు.

వాడు నా చెడ్డీ దోస్త్

వాడు నా చెడ్డీ దోస్త్

‘‘సీనియర్ నరేష్‌గారి అబ్బాయి నవీన్ నా చెడ్డీ దోస్త్. చిన్నతనంలో చెన్నైలో ఒకే వీధిలో ఉండేవారం. తను అపుడు చరణ్ ఫ్రెండ్. చరణ్ కోసం చిరంజీవిగారి ఇంటికి వచ్చేవాడు. అప్పుడే నెల్లూరు నుంచి చెన్నై షిప్ట్ అయిన నాకు మంచి స్నేహితుడయ్యాడు'' అని సాయి ధరమ్ తేజ్ గుర్తు చేసుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X