twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sai Dharam Tej కు కీలక సర్జరీ.. 48 గంటల డేంజర్‌ జోన్ ముగిసిన తర్వాత పరిస్థితి ఏమిటంటే?

    |

    మెగా హీరో సాయిధరమ్ తేజ్ బైక్ యాక్సిండెట్ తర్వాత తీవ్రమై గాయాలతో అపోలో హస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే యాక్సిడెంట్ తర్వాత సాయిధరమ్ తేజ్‌పై బైక్ నడిపిన తీరుపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అపోలో వైద్యులు కీలక సర్జరీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. సాయిధరమ్ తేజ్ ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు అపోలో హాస్పిటల్ వర్గాలు సమాచారం అందిస్తున్నారు. సాయిధరమ్ తేజ ఆరోగ్యం, సర్జరీ గురించిన వివరాల్లోకి వెళితే..

    Sai Dharam Tej Accident ట్రాఫిక్ ఫైన్ కట్టిన గుర్తుతెలియని వ్యక్తి.. కూపీ లాగుతున్న పోలీసులు!Sai Dharam Tej Accident ట్రాఫిక్ ఫైన్ కట్టిన గుర్తుతెలియని వ్యక్తి.. కూపీ లాగుతున్న పోలీసులు!

     రూమర్లకు తెర పడటంతో

    రూమర్లకు తెర పడటంతో

    గాయాల బారిన పడి ఆపస్మారక స్థితిలో ఉన్న సాయిధరమ్ తేజ్‌ను శుక్రవారం రాత్రి అపోలో హాస్పిటల్‌కు తరలించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన సాయిధరమ్ తేజ్ శుక్రవారం రాత్రి 7.45 గంటల ప్రాంతంలో అపోలో జూబ్లిహిల్స్‌లోని చేరారు. ఆయన ప్రధాన అవయవాలు నిలకడగా పనిచేస్తున్నాయి. వైద్యులు చికిత్సకు పూర్తిగా రెస్పాండ్ అవుతున్నారు అని చెప్పడంతో కొన్ని రూమర్లకు తెరపడింది.

    ట్రీట్‌మెంట్ చేస్తున్న డాక్టర్లు వీరే

    ట్రీట్‌మెంట్ చేస్తున్న డాక్టర్లు వీరే

    సాయిధరమ్ తేజ్‌కు న్యూరో సర్జన్ అలోక్ రంజన్ అనే అత్యుత్తమ వైద్యుడి పర్యవేక్షణలో చికిత్స కొనసాగిస్తున్నారు. క్రిటికల్ కేర్ డాక్టర్ సుబ్బారెడ్డి, పాలమనాలజిస్ట్ డాక్టర్ సాయి ప్రవీణ్ హరనాథ్, ఆర్థోపెడిక్స్ సర్జన్ డాక్టర్ బాలవర్ధన్ రెడ్డి ఆయనకు సహకారం అందిస్తున్నారు.

    24 గంటల అబ్జర్వేషన్ ముగియడంతో

    24 గంటల అబ్జర్వేషన్ ముగియడంతో

    ఇదిలా ఉంటే.. తాజా హెల్త్ బులెటిన్ వెల్లడించిన ప్రకారం.. సాయి ధరమ్ తేజ్‌కు దేహం లోపల బలమైన గాయాలు లేవని, అలాగే ఇంటర్నల్‌గా బ్లీడింగ్ కూడా అవ్వడం లేదని పలు పరీక్షల అనంతరం వైద్యులు స్పష్టత ఇచ్చారు. అయితే 24 గంటల అబ్జర్వేషన్‌లో పెట్టాం. ఆ తర్వాతే సాయిధరమ్ తేజ్‌కు తదుపరి సర్జరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం అని వైద్యులు బులెటిన్‌లో పేర్కొన్నారు.

    భూజానికి కీలక చికిత్స

    భూజానికి కీలక చికిత్స

    హైటెక్ సిటీకి సమీపంలోని ఐకియా స్టోర్ దాటిన తర్వాత అతివేగంగా వెళ్తున్న సాయిధరమ్ తేజ్ బైక్ స్కిడ్ కావడంతో తన ఎడమవైపు బాడీతో రోడ్డుపై పడిపోయాడు. దాంతో భుజానికి సంబంధించిన ఎముక విరిగిపోయింది. అలాగే ఎడమ కంటిపై గాయం అయింది. వీటికి సంబంధించి సర్జరీని వీలైతే.. సాయిధరమ్ తేజ్ శరీరం సహకరిస్తే కీలక ఆపరేషన్‌ను చేయాలని నిర్ణయించుకొన్నట్టు సమాచారం.

    Recommended Video

    Hero Sai Dharam Tej యాక్సిడెంట్ పై స్పందించిన Actor Naresh || Filmibeat Telugu
    48 గంటల డేంజర్ జోన్ నుంచి

    48 గంటల డేంజర్ జోన్ నుంచి

    సాయిధరమ్ తేజ్ శరీరం పూర్తిగా సహకరిస్తే ఆదివారం రోజున కీలక సర్జరీని చేసే అవకాశం ఉందనే విషయం సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే సాయిధరమ్ తేజ్ కోలుకోవడాన్ని బట్టి క్లిష్టమైన సర్జరీని చేయడానికి నిర్ణయం తీసుకొంటామని తాజా బులెటిన్‌లో వైద్యులు క్లారిటీ ఇచ్చారు. అలాగే ప్రమాదం జరిగిన రోజు నుంచి 48 గంటల తర్వాతే సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం గురించి ఓ క్లారిటీకి వస్తామని చెప్పారు. దాంతో ఆ గడువు కూడా ఈ రోజు ముగియనున్నది. దాంతో చికిత్సకు సహకరించే పరిస్థితి ఉంటే వైద్యులు ఆదివారం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలిసింది.

    English summary
    Sai Dharam Tej may under go major surgery. Latest Health Bulletin of Apollo Hosptial revealed that He's responding well to treatment under the care of Dr. Alok Ranjan & Team. Surgery for collar bone injury will be booked into in the next 24hrs.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X