Sai Dharam Tej సర్జరీ పూర్తి.. హెల్త్ బులిటెన్ లో కీలక వివరాలు వెల్లడించిన వైద్యులు

టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి అపోలో వైద్యులు ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్ విడుదల చేసి వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది రాజా హెల్త్ బులిటెన్ లో వైద్యులు పేర్కొన్నారు అనే వివరాలు లోకి వెళితే

రోడ్డు ప్రమాదం

రోడ్డు ప్రమాదం

శుక్రవారం వినాయక చవితి రోజున సుమారు ఎనిమిది గంటల సమయంలో సాయి ధరమ్ తేజ్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 నుంచి కేబుల్ బ్రిడ్జి మీదుగా గచ్చిబౌలి వెళ్తున్న క్రమంలో కోహినూర్ హోటల్ వద్ద రోడ్డు మీద ఇసుక కారణంగా అదుపు తప్పి ప్రమాదానికి గురయ్యాడు. అయితే ఆయనను అప్పట్లో దగ్గరలో ఉన్న మెడికవర్ హాస్పిటల్ కి తరలించారు.

అపోలో హాస్పిటల్ లో

అపోలో హాస్పిటల్ లో

అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత అపోలో హాస్పిటల్ కి సాయిధరమ్ తేజ్ ను తరలించారు. ఇక అప్పటి నుంచి అపోలో వైద్యులు ఎక్స్పర్ట్స్ పర్యవేక్షణలోనే సాయి ధరమ్ తేజ్ చికిత్స కొనసాగుతోంది ముందుగా అపోలో హాస్పిటల్ లో చేరిన తర్వాత 48 గంటలు దాటితే కానీ ఎలాంటి వివరాలు వెల్లడించలేదని పేర్కొన్న వైద్యులు ఆయన ఆరోగ్యం బాగానే ఉందని పేర్కొన్నారు.

శస్త్ర చికిత్స విజయవంతంగా

శస్త్ర చికిత్స విజయవంతంగా

ఇక ఈ ఉదయం పేర్కొన్న దాని ప్రకారం ఆయనకు బాడీ లోపల కూడా ఎలాంటి ఇబ్బందులు లేవని ముందు అంతర్గతంగా గాయాలు తగిలాయి ఏమో అని భావించినా ఇప్పుడు అనేక పరీక్షల అనంతరం అలాంటిదేమీ లేదని తేల్చారు. అయితే కాలర్ బోన్ డిస్ లోకేట్ అయిన కారణంగా దానికి శస్త్రచికిత్స చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతూ వచ్చింది.

తాజాగా అపోలో వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం సాయి ధరమ్ తేజ్ కి నిర్వహించిన కాలర్ బోన్ సర్జరీ విజయవంతంగా పూర్తయింది. హైదరాబాద్ లోని టాప్ మోస్ట్ ఆర్థోపెడిక్ సర్జన్ అయిన అలోక్ రంజన్ బృందం ఈ కాలర్ బోన్ శస్త్ర చికిత్స చేయగా అది విజయవంతంగా పూర్తయిందని ఒక ప్రకటన కూడా విడుదలైంది.

24 గంటల పాటు అబ్జర్వేషన్ లో

24 గంటల పాటు అబ్జర్వేషన్ లో

అయితే సాయి ధరమ్ తేజ్ చికిత్స విజయవంతంగా జరిగినా సరే మరో 24 గంటల పాటు ఆయనను అబ్జర్వేషన్ లో ఉంచుతామని కూడా అపోలో వైద్యులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. క్రమంగా ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి మెరుగు పడుతోందని డాక్టర్లు చెబుతున్నారు. ఆపరేషన్ పూర్తైన తర్వాత సాయిధరమ్ తేజ్ ని ఐసీయూలోకి తరలించారు. తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Recommended Video

Hero Sai Dharam Tej యాక్సిడెంట్ పై స్పందించిన Actor Naresh || Filmibeat Telugu
ఆరోగ్యం నిలకడగా

ఆరోగ్యం నిలకడగా

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు, అయితే ఈ నేపథ్యంలో సాయి తేజ్‌ బావ, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, ఆయన భార్య ఉపాసన, అల్లు అరవింద్‌ లు సైతం ఉదయం ఆస్పత్రికి వచ్చి వైద్యులతో మాట్లాడి వెళ్లారు. కాగా ఈ ప్రమాదంలో సాయి తేజ్‌ కాలర్‌ బోన్‌ ఫ్యాక్చర్‌ కాగా ఛాతి భాగంలో కూడా గాయం అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X