twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇండిపెండెన్స్ డే సెలెబ్రేషన్స్.. అద్భుతమైన ఆలోచన అంటోన్న తారలు

    |

    స్వాతంత్ర్య దినోత్సవం నాడు మనమంతా జెండాను ఎగురవేస్తాం. అయితే మరునాడు రోడ్లపైనా ఆ జాతీయ జెండాలు కనబడుతుంటాయి. కొందరు వాటిని అలానే చూసి వదిలేస్తుంటారు. మరికొందరు వాటిని ఏరిపారేస్తారు. నిత్యం ఇదే తంతు జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సారి మాత్రం అలా జరగకూడదని, మంచి ఆలోచనతో టాలీవుడ్ తారలంతా ఓ విషయాన్ని ప్రమోట్ చేస్తున్నారు. ప్లాంటబుల్ ఫ్లాగ్ సీడ్‌ను రూపొందించారని, వాటినే జెండాలుగా వాడాలని అందరికీ సూచిస్తున్నారు.

    ఈ మేరకు మెగా హీరో సుప్రీమ్ స్టార్ సాయి ధరమ్ తేజ్ ప్రజలకు అవగాహాన కలిగిస్తున్నాడు. ఈ మేరకు సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేస్తూ.. 'ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మనమంతా మన దేశ భక్తిని చాటి చెప్పేందకు బయో డీగ్రేడబుల్ జెండాను వాడుదాం. వాటిని తిరిగి మనం మొక్కలుగా మార్చొచ్చు. ప్రకృతి, పర్యావరణాన్ని కాపాడేందుకు చేతులు కలుపుదాం. గ్రీన్ కామ్రేడ్, గ్రీన్ వేవ్స్ అనే సంస్థలు ఈ పద్దతిని ముందుకు తీసుకు వచ్చాయ'ని తెలిపాడు.

     Sai Dharam Tej And Naga Chaitanya About Plantable seed Flag

    ఈ ప్లాంటబుల్ సీడ్ ఫ్లాగ్‌ను ఎలా మొక్కలుగా మలచాలో కూడా చెప్పుకొచ్చారు. మూడు రోజులు నీటిలో నానా బెట్టాలి, ఆపై నేలలో పాతి పెట్టి.. రోజూ నీళ్లు పోయాలి. అందులో ఉన్న పేపర్ బయో డీగ్రేడ్ అవుతాయి.. విత్తనం మొలకెత్తడానికి దాదాపు మూడు వారాలు పట్టొచ్చని పేర్కొన్నారు. ఇక పద్దతిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తారలంతా కదిలి వస్తున్నారు. వెంకీ కుడుముల, నభా నటేష్, నిధి అగర్వాల్, నివేదా పేతురాజ్, పూరి జగన్నాద్, ఆర్జే చైతు, ఆర్జే హేమంత్ వంటి వారంతా ఈ పద్దతికి జై కొడుతున్నారు.

    English summary
    Sai Dharam Tej And Naga Chaitanya About Plantable seed Flag. This Independence Day, let's use a bio degradable flag to show our patriotism which can later be turned in to a plant by following a simple procedure. Let's join hands to protect our environment. An initiative by
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X