పేరు మార్చుకొన్న సాయిధరమ్ తేజ్.. కొత్త పేరు ఏమిటో తెలుసా? ఎందుకు మార్పు అంటే?

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ నటించిన సత్య షార్ట్ ఫిలిం స్పెషల్ ప్రీమియర్ షోను హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో మీడియాకు ప్రదర్శించారు. నవీన్ విజయ్ కృష్ణ దర్శకత్వంలో ఈ షార్ట్ ఫిలిం రూపొందిన విషయం తెలిసిందే. ఈ ఫిలింలో సాయి ధరమ్ తేజ్, స్వాతిరెడ్డి నటించగా, బలగం నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. ఈ ప్రీమియర్ షో అనంతరం సాయిధరమ్ తేజ్ మీడియాతో మాట్లాడుతూ కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఆయన చెప్పిన విషయాల్లోకి వెళితే..

రాంచరణ్‌తో మల్టీ స్టారర్ సినిమాలో నటించాలనే కోరిక ఉంది. దాని కోసం వేచి చూస్తున్నాను. గతంలో నాగబాబు గారితో నటించాను. మొన్నీ మధ్య బ్రో సినిమాలో పవన్ కల్యాణ్‌తో నటించాను. ఇక ముందు మా పెద్ద మామయ్య చిరంజీవితో కలిసి నటించాలని వేచి చూస్తున్నాను. ఆ తర్వాత రాంచరణ్‌తో కలిసి పనిచేస్తాను అని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

Sai Dharam Tej Changed His name as Sai Durga Tej Reveals in Satya Premier Show in Hyderabad

అయితే తాను నటించనున్న గంజాయి శంకర్ సినిమా పక్కన పెట్టేసినట్టు వచ్చిన వార్తలు అవాస్తవం. కొన్ని వెబ్ సైట్స్ నిజాలు తెలుసుకోకుండా వార్తలు రాస్తున్నారు. ఆ క్రమంలోనే ఆ సినిమా ఆపేశామనే వార్తను కొందరు రాశారు. ఆ సినిమా యధావిధిగా కొనసాగుతుందని సాయిధరమ్ తేజ్ చెప్పారు.

ఇక నుంచి నా పేరు సాయిధరమ్ తేజ్ కాదు. నా పేరును సాయిదుర్గ తేజ్‌గా మార్చుకొన్నాను. నా పేరులో మా నాన్న పేరు ఇంటిపేరుతో ఎలాగు ఉంటుంది. నా పేరులో అమ్మ దుర్గ పేరు ఉండాలని పేరు మార్చుకొన్నాను. మా అమ్మ కూడా నాతోను, నా పేరులో కూడా ఉండాలనే ఉద్దేశంతో పెట్టుకొన్నాను అని సాయిదుర్గా తేజ్ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X