Don't Miss!
- News వాళ్ళను తిడుతూనే.. వైఎస్ జగన్, భారతి వద్ద కోట్లలో వైఎస్ షర్మిలమ్మ అప్పులచిట్టా ఇదే!!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్‌కు భారీ అడ్డంకి..!
- Lifestyle నిమ్మరసంతో ఇన్ని ప్రయోజనాలాా..? కిడ్నీలో రాళ్లు కూడా మాయం, ఇంకా ఎన్నో..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
హిందీలోనూ సత్తా చాటిన మెగా హీరో: ఏకంగా ఆ సినిమాతో సెంచరీ కొట్టేశాడు
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు టాలెంటెడ్ హీరో సాయి ధరమ్ తేజ్. కెరీర్ ఆరంభంలోనే పలు విజయాలను అందుకున్న అతడు.. చాలా కాలం పాటు వరుస ఫ్లాపులతో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో 'చిత్రలహరి' అనే సినిమాతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఇది అతడికి విజయాన్ని అందించడమే కాదు.. కెరీర్‌కు బూస్టును కూడా ఇచ్చింది. అదే సమయంలో కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసి.. భారీ స్థాయిలో వసూళ్లను రాబట్టింది. అందుకే ఈ సినిమా సాయి ధరమ్ తేజ్ కెరీర్లోనే స్పెషల్ అని చెబుతుంటారు.
థియేటర్లలో సత్తా చాటిన 'చిత్రలహరి' మూవీ అమెజాన్ ప్రైమ్ ద్వారా డిజిటల్ స్ట్రీమింగ్ అయింది. అందులో కూడా ఈ సినిమాకు భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో ఎక్కువ మంది వీక్షించిన చిత్రాల జాబితాలో చేరిపోయింది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాను 'ప్రేమమ్' పేరిట హిందీలోకి డబ్బింగ్ చేసి యూట్యూబ్‌లో విడుదల చేశారు. తెలుగు ప్రేక్షకుల మాదిరిగానే ఉత్తరాది వాళ్లు కూడా ఈ చిత్రాన్ని ఆదరించారు. ఫలితంగా ఇది భారీ స్థాయిలో వ్యూస్‌ను రాబట్టింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా వంద మిలియన్ మార్కును చేరుకుంది. అలాగే, దాదాపు ఒక మిలియన్ లైకులకు చేరువగా వచ్చేసింది.
ఇదిలా ఉండగా.. 'చిత్రలహరి' తర్వాత సాయి ధరమ్ తేజ్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. దీని తర్వాత మారుతి డైరెక్షన్లో వచ్చిన 'ప్రతిరోజూ పండగే'తో వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు, ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లు సాధించింది. ఇక, ఇటీవలే 'సోలో బ్రతుకే సో బెటర్'తో వరుసగా మూడో హిట్‌ను అందుకున్నాడు. ఇక, ప్రస్తుతం దేవ కట్టా దర్శకత్వంలో 'రిపబ్లిక్' అనే సినిమా చేస్తున్నాడు. ఆ మధ్య విడుదలైన ఈ మూవీ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.