తేజు ట్రైయాంగిల్ లవ్ స్టోరీ.. అప్పుడే సగం కంప్లీట్!

మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం చిత్రలహరి చిత్రంలో నటిస్తున్నాడు. కిషోర్ తిరుమల దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తేజు కెరీర్ కు చాలా కీలకం. సాయి ధరమ్ తేజ్ నటించిన గత చిత్రాలు వరుసగా నిరాశపరిచాయి. దీనితో తేజు చిత్రలహరిపై దృష్టి పెట్టాడు. ఈ చిత్రాన్ని దర్శకుడు ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందిస్తుండడం విశేషం.

తేజు సరసన ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్, నివేత పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరి ముగ్గురి మధ్య సాగే ప్రేమ కథ సరదాగా, ఆసక్తిగా ఉంటుందని సమాచారం. ఈ చిత్ర షూటింగ్ కి సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. కిషోర్ తిరుమల వేగంగా ఈ చిత్రాన్ని చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

 Sai Dharam Tej Chitralahari shooting update

సాయి ధరమ్ తేజ్ ఈ చిత్రంలో గుబురు గడ్డంతో కొత్త లుక్ లో కనిపించనున్నాడు. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రాన్ని సంగీతం అందిస్తున్నాడు. గత నెలలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. అంతలోనే సగభాగం షూటింగ్ ఫినిష్ కావడం ఆశ్చర్యాన్ని కలిగించే అంశం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X