‘రిపబ్లిక్’ రిలీజ్‌పై సాయి ధరమ్ తేజ్ క్లారిటీ: ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పుడంటే!

ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. ఈ జోష్‌లోనే మరిన్ని చిత్రాలను చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం అతడు విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరొందిన దేవ కట్టాతో కలిసి 'రిపబ్లిక్' అనే మూవీ చేస్తున్నాడు. సందేశాత్మక కథతో రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి వచ్చిన ప్రతీ దానికి ప్రేక్షకుల స్పందన దక్కింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ రిలీజ్‌పై అసలైన వివరణ దొరికేసింది.

పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతున్న 'రిపబ్లిక్' మూవీని జూన్ 4న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ యూనిట్ ప్రకటించింది. అయితే, కరోనా రెండో దశ కారణంగా అది వీలు పడలేదు. దీంతో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తారని.. భారీ ధరకు ఓ సంస్థ దీని హక్కులను కొనుగోలు చేసిందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో సాయి ధరమ్ తేజ్ దీనిపై స్పందించాడు. తమ సినిమా ఓటీటీలో విడుదల కావడం లేదని స్పష్టం చేశాడు. అంతేకాదు, అతి త్వరలోనే దీన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు కూడా వెల్లడించాడు.

 Sai Dharam Tej Clarity about Republic Movie OTT Release

తాజా సమాచారం ప్రకారం.. 'రిపబ్లిక్' మూవీ ఆగస్టు చివరి వారంలో కానీ, సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో కానీ విడుదల కాబోతుందట. ఈ ప్రకటన కూడా కొద్ది రోజుల్లో రానుందని అంటున్నారు. కొల్లేరు సరస్సు సమస్యలపై ఈ చిత్రం రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో సాయి ధరమ్ తేజ్ ప్రభుత్వ ఉద్యోగిగా నటిస్తుండగా.. రమ్యకృష్ణ ముఖ్యమంత్రి పాత్రను చేస్తోంది. ఇక, ఇందులో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను భగవాన్, పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు భారీ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X