కష్టకాలంలో ఆ ఇద్దరు కుడి ఎడమగా నిలిచారు.. సాయిధరమ్ తేజ్ ఎమోషనల్

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ నటించిన విరూపాక్ష చిత్రం భారీ విజయం వైపు దూసుకెళ్తున్నది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం రికార్డు వసూళ్లను రాబడుతున్నది. బీవీఎన్ఎస్ ప్రసాద్, సుకుమార్ నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే 100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విరూపాక్ష టీమ్ థ్యాంక్యూ మీటింగ్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ..

దిల్ రాజు రావడం హ్యాపీగా ఉంది:విరూపాక్ష సక్సెస్‌ను పంచుకోవడానికి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌కు దిల్ రాజు రావడం చాలా ఆనందంగా ఉంది. మా సినిమాను ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించిన మీడియాకు థ్యాంక్స్. అలాగే మా సినిమాలో పని చేసిన టీమ్ మెంబర్స్‌కు చాలా థ్యాంక్స్. 100 శాతం ఇవ్వమని అడిగితే.. అంతకంటే ఎక్కువ పనిచేశారు. ఆర్ట్, సౌండ్, సినిమాటోగ్రఫి విభాగాల గురించి చాలా మంది మాట్లాడుతూ ప్రశంసలు గుప్పిస్తున్నారు అని సాయిధరమ్ తేజ్ అన్నారు.

మేకప్ ఆర్టిస్టులు కీలకంగా :విరూపాక్ష సినిమాను ఫీల్‌గుడ్‌గా మలిచిన నవీన్ నూలి, మేకప్ ఆర్టిస్టులకు ధన్యవాదాలు. మా సినిమాలో ఆర్టిస్టులను సరికొత్త గెటప్‌లో చూపించిన మేకప్ ఆర్టిసులకు థ్యాంక్స్. క్లైమాక్స్‌లో సంయుక్త మీనన్‌కు బాగా మేకప్ చేశారు. మా ప్రయత్నాన్ని సిన్సియర్‌గా ఆమోదించి సినిమాను పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్యూ సో మచ్. మీ ప్రోత్సాహంతో మరిన్ని మంచి సినిమాలు చేస్తాం అని సాయిధరమ్ తేజ్ చెప్పారు.

Sai Dharam Tej emotional speech at Virupaksha movie Thank You Meet

నాకు కుడి, ఎడమ భుజాలుగా :యాక్సిడెంట్ తర్వాత నేను చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు చాలా మంది నాకు సపోర్ట్ చేశారు. వారిలో ప్రొడక్షన్ మేనేజర్లు ఇద్దరు సతీష్‌లు నా వెంట ఉన్నారు. నాకు కుడి ఎడమ భుజాలుగా నిలిచారు. అలాగే నా వ్యక్తిగత డ్రైవర్‌గా పనిచేసిన నాగికి కూడా చాలా థ్యాంక్స్. నాకు సపోర్టుగా నిలిచిన అందరికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాను అని సాయి ధరమ్ తేజ్ తెలిపారు.

Sai Dharam Tej emotional speech at Virupaksha movie Thank You Meet

100 కోట్ల వైపు విరూపాక్ష జర్నీ: ఇదిలా ఉండగా, విరూపాక్ష చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నది. ఏప్రిల్ 21వ తేదీన రిలీజైన ఈ చిత్రం రెండోవారంలో కూడా భారీ వసూళ్లను రాబడుతున్నది. 40 కోట్ల రూపాయలతో రూపొందిన ఈ చిత్రం గత 10 రోజుల్లో 76 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. త్వరలోనే ఈ చిత్రం 100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X