వివాదాస్పద అంశంపై సాయి ధరమ్ తేజ్ పోరాటం: ఏకంగా ఏపీ సీఎంతోనే గొడవకు సై అన్న మెగా హీరో!

మెగా కాంపౌండ్ నుంచి సినిమాల్లోకి ప్రవేశించినా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. కెరీర్ ఆరంభంలోనే కొన్ని విజయాలను అందుకున్న అతడు... కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడిపించుకుంటున్నాడు. మధ్యలో కొన్ని పరాజయాలు ఎదురైనప్పటికీ.. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో వరుస హిట్లను అందుకుంటున్నాడు. ఇలాంటి సమయంలో సాయి ధరమ్ తేజ్ ఓ వివాదాస్పద అంశంపై పోరాటం ప్రారంభించాడు. దీంతో సీఎంతో గొడవకు దిగాడు. ఆ వివరాలు మీకోసం!

అలా పరిచయం.. వరుస ఫ్లాపులు

అలా పరిచయం.. వరుస ఫ్లాపులు

వైవీఎస్ చౌదరి తెరకెక్కించిన 'రేయ్' సినిమాతో పరిచయం అవ్వాల్సి ఉన్నా.. అది అనివార్య కారణాలతో వాయిదా పడడంతో 'పిల్లా నువ్వు లేని జీవితం' ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సాయి ధరమ్ తేజ్. కెరీర్ ఆరంభంలోనే 'సుబ్రమణ్యం ఫర్ సేల్', 'సుప్రీమ్' వంటి హిట్లను తన ఖాతాలో వేసుకున్న అతడు.. ఆ తర్వాత వరుస ఫ్లాపులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.

అక్కడి నుంచి ట్రాక్ ఎక్కిన సాయి

అక్కడి నుంచి ట్రాక్ ఎక్కిన సాయి

వరుస పరాజయాలతో సతమతం అవుతున్న తరుణంలో సాయి ధరమ్ తేజ్ 'చిత్రలహరి'తో హిట్ ట్రాక్ ఎక్కాడు. దీని తర్వాత మారుతి డైరెక్షన్‌లో వచ్చిన 'ప్రతిరోజూ పండగే'తో వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు, ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లు సాధించింది. దీంతో ఆ ఏడాది వచ్చిన ఉత్తమ చిత్రాల జాబితాలో ఒకటిగా నిలిచి సత్తా చాటింది.

లాక్‌డౌన్ తర్వాత సోలోగా కొట్టాడు

లాక్‌డౌన్ తర్వాత సోలోగా కొట్టాడు

ఇక, లాక్‌డౌన్ తర్వాత సాయి ధరమ్ తేజ్ నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్'తో సినిమాల విడుదల ప్రారంభం అయింది. సుబ్బు అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమాను భోగవిల్లి ప్రసాద్ నిర్మించారు. ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్‌గా చేసింది. ఎన్నో ఆశలతో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని దక్కించుకుని.. తెలుగు సినీ పరిశ్రమకు కొత్త జీవాన్ని ఇచ్చింది.

పవన్ సహకారంతో ప్రారంభించాడు

పవన్ సహకారంతో ప్రారంభించాడు

'సోలో బ్రతుకే' తర్వాత సాయి ధరమ్ తేజ్.. ప్రస్థానం ఫేం దేవకట్టా దర్శకత్వంలో 'రిపబ్లిక్' అనే సినిమా చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా ఈ సినిమా ప్రారంభం అయింది. భగవాన్, పుల్లారావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ మూవీలో నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించారు.

వివాదాస్పద అంశంపై తేజ్ పోరాటం

వివాదాస్పద అంశంపై తేజ్ పోరాటం

దేవకట్టా సినిమాలు అంటేనే వైవిధ్యంగా సాగుతుంటాయి. వీటిలో ఎక్కువగా రాజకీయ కోణాలు కనిపిస్తుంటాయి. ఇక, 'రిపబ్లిక్' కూడా పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తోనే రూపొందుతున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే తాజాగా ఈ మూవీ గురించి ఓ న్యూస్ లీకైంది. దీని ప్రకారం.. ఇందులో మెగా హీరో వివాదాస్పదమైన కొల్లేరు సరస్సు అంశంపై పోరాటం చేస్తాడట.

ఏకంగా ఏపీ సీఎంతోనే గొడవకు సై

ఏకంగా ఏపీ సీఎంతోనే గొడవకు సై

ఏపీ రాజకీయాల్లో కొల్లేరు సరస్సు అంశం అప్పట్లో పెద్ద రచ్చను లేపింది. ఇప్పుడు దీన్నే 'రిపబ్లిక్‌'లో చూపించబోతున్నారని తెలిసింది. హీరో సాయి ధరమ్ తేజ్.. కలెక్టర్‌గా పని చేస్తున్న సమయంలోనే దీనిపై పోరాటం ప్రారంభిస్తాడట. అదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రమ్యకృష్ణతో గొడవకు సిద్ధం అవుతాడట. ఇందులో చివరికి హీరో ఎలా గెలిచాడనేదే చిత్ర కథ అని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X