ఆ సీఎంను టార్గెట్ చేస్తున్న సాయి ధరమ్ తేజ్.. మెగా హీరో సాహసం వెనుక అసలు కథ ఇదే.!

By Manoj

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా సినీ రంగంలోకి ప్రవేశించాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. వైవీఎస్ చౌదరి తెరకెక్కించి 'రేయ్' సినిమాతో పరిచయం అవ్వాల్సి ఉన్నా.. అది అనివార్య కారణాలతో వాయిదా పడడంతో 'పిల్లా నువ్వు లేని జీవితం' ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. అక్కడి నుంచి వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న ఈ యంగ్ హీరో.. ఓ ముఖ్యమంత్రిని టార్గెట్ చేశాడని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఈ మెగా హీరో అంత పెద్ద సాహసం ఎందుకు చేస్తున్నాడు.? పూర్తి వివరాల్లోకి వెళితే...

విజయాల కంటే పరాజయాలే ఎక్కువ

విజయాల కంటే పరాజయాలే ఎక్కువ

సాయి ధరమ్ తేజ్ కెరీర్ ఏమంత ఆశాజనకంగా సాగడం లేదు. కెరీర్ ఆరంభంలో వచ్చిన ‘సుబ్రమణ్యం ఫర్ సేల్', ‘సుప్రీమ్' మాత్రమే హిట్లుగా నిలిచాయి. ఆ తర్వాత అతడు నటించిన చిత్రాల్లో చాలా వరకు పరాజయం పాలయ్యాయి. అయినప్పటికీ ఈ మెగా హీరో ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ఈ క్రమంలోనే జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు.

హిట్ ట్రాక్ ఎక్కాడు.. ఇంకోటి కొట్టాడు

హిట్ ట్రాక్ ఎక్కాడు.. ఇంకోటి కొట్టాడు


వరుస పరాజయాలతో సతమతం అవుతున్న తరుణంలో సాయి ధరమ్ తేజ్ ‘చిత్రలహరి'తో హిట్ ట్రాక్ ఎక్కాడు. అప్పటి వరకు కమర్షియల్ సినిమాలు చేసుకుంటూ వచ్చిన అతడు.. ఈ మూవీతో మెసేజ్ కూడా ఇచ్చాడు. దీంతో ప్రేక్షకుల మెప్పు పొందింది. దీని తర్వాత ఇటీవల మారుతి డైరెక్షన్‌లో వచ్చిన ‘ప్రతిరోజూ పండగే'తో వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

ఒంటరిగా బతకడమే బెటర్ అంటున్నాడు

ఒంటరిగా బతకడమే బెటర్ అంటున్నాడు


‘ప్రతిరోజూ పండగే' ఇచ్చిన సక్సెస్‌తో జోష్ మీద ఉన్న సాయి ధరమ్ తేజ్.. ఆ వెంటనే మరో సినిమాకు పచ్చజెండా ఊపేశాడు. ‘సోలో బతుకే సో బెటరు' అనే టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమాను సుబ్బు అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. భోగవిల్లి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది.

స్పీడు పెంచిన సాయి.. పవన్ ఆశీస్సులతో..

స్పీడు పెంచిన సాయి.. పవన్ ఆశీస్సులతో..

ఇప్పటికే ‘సోలో బతుకే సో బెటరు'లో నటిస్తున్న సాయి ధరమ్.. మరో సినిమాను కూడా ఓకే చేసేశాడు. వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించిన దేవ కట్టా దీనికి దర్శకత్వం వహించనున్నాడు. భగవాన్, పుల్లారావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ మూవీలో నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలకు పవన్ కల్యాణ్ విచ్చేశారు.

ఆ సీఎంను టార్గెట్ చేస్తున్న సాయి ధరమ్

ఆ సీఎంను టార్గెట్ చేస్తున్న సాయి ధరమ్


దేవ కట్టా సినిమాలు అంటేనే భిన్నమైన కథాంశంతో సాగుతాయి. ఇప్పుడు సాయి ధరమ్‌ తేజ్‌తో చేసే సినిమా కూడా అలాగే ఉంటుందని అంటున్నారు. ఇప్పటి వరకు ఈ మెగా హీరో చేయని పాత్రను ఈ మూవీలో చూపిస్తాడట. ఇందులో భాగంగానే ఓ మహిళా ముఖ్యమంత్రితో అతడు పోరాటం చేస్తాడని అంటున్నారు. ఆ పాత్రను రమ్యకృష్ణ పోషించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

మెగా హీరో సాహసం వెనుక అసలు కథ ఇదే.!

మెగా హీరో సాహసం వెనుక అసలు కథ ఇదే.!

పూర్తి పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో సాయి ధరమ్ తేజ్ స్టూడెంట్ లీడర్‌గా కనిపించబోతున్నాడట. ప్రస్తుత విద్యా వ్యవస్థలో ఉన్న లొసుగులను కనిపెట్టి అధికార పార్టీపై పోరాటం చేస్తాడని అంటున్నారు. ఈ క్రమంలోనే ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన రమ్యకృష్ణ (పరిశీలనలో ఉన్న పేరు)ను టార్గెట్ చేసి, పదవి నుంచి దించడానికి చేసే ప్రయత్నాలే సినిమా కథ అని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X