పెళ్లికొడుకు కాబోతున్న సాయిధరమ్ తేజ్.. సారీ ప్రభాస్ అన్నా అంటూ.. ఆ గ్రూప్ నుంచి లెఫ్ట్!
కరోనా వచ్చి ఇబ్బంది పెడుతోంది గాని లేకుంటే మన స్టార్ హీరోల పెళ్లిళ్లు ఒక రేంజ్ లో జరిగి ఉండేవి. టాలీవుడ్ ఇండస్ట్రీలో గతంలో ఎప్పుడు లేని విధంగా వరుసగా పెళ్లి సంబరాలకు సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒకరి తరువాత మరొకరు బ్యాచిలర్ లైఫ్ కి ఎండ్ కార్డ్ పెట్టేస్తున్నారు. ఇక ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ కూడా అందుకు సిద్దమవుతున్నాడని తెలుస్తోంది.

పెళ్లి సిద్ధమవుతున్న సాయి ధరమ్ తేజ్..
పెళ్లికి సిద్ధమవుతున్నట్లు సాయి ధరమ్ తేజ్ చాలా డిఫరెంట్ గా చెప్పాడు. కొన్ని రోజుల క్రితం ఇదే తరహాలో సందీప్ కిషన్ కూడా తన లైఫ్ కి సంబంధించిన ఒక కీలక నిర్ణయం చెప్పబోతున్నట్లు చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు. అందరూ పెళ్లి న్యూస్ చెబుతున్నాడు అని అనుకున్నారు. కానీ సరికొత్త ప్రొడక్షన్ హౌజ్ ని స్థాపించి సినిమాను ఎనౌన్స్ చేశాడు

టైమ్ వచ్చినప్పుడు..
అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఇటీవల నిఖిల్, నితిన్, రానా పెళ్లి చేసుకొని బ్యాచిలర్ లైఫ్ కి ఎండ్ కార్డ్ పెట్టేసిన విషయం తెలిసిందే. అయితే సాయి ధరమ్ తేజ్ కూడా అదే తరహాలో ఒక వాట్సాప్ కి సంబంధించిన గ్రూప్ ద్వారా వివరణ ఇవ్వడం వైరల్ గా మారింది. "ఒక్కోసారి మనం ఎన్నో అనుకుంటాం కానీ ఆ టైమ్ వచ్చినప్పుడు మరి.." అని ట్వీట్ చేసిన విధానం చూస్తుంటే పెళ్లి విషయం చెప్పబోతున్నాడు అని అర్ధమవుతోంది.

సింగిల్ ఆర్మీ గ్రూప్ నుంచి..
రేపు ఉదయం 10గంటలకు అసలు విషయం చెబుతానని క్లారిటీ ఇచ్చిన సాయి.. సింగిల్ ఆర్మీకి సంబంధించిన వాట్సాప్ వీడియోను షేర్ చేశాడు. ఆ గ్రూప్ ప్రొఫైల్ డీపీగా ఆర్.నారాయణమూర్తి ఫోటో ఉండడం విశేషం. ఇక మొదట నిఖిల్ ఎంగేజ్మెంట్ అయ్యిందని గ్రూప్ నుంచి వెళ్లిపోగా.. ఆ తరువాత నితిన్ కూడా భీష్మగా ఉండలేను అంటూ వెళ్లిపోయాడు.
Recommended Video

హఠాత్మరిణామం.. సారి ప్రభాస్ అన్నా
ఆ తరువాత రానా కూడా ఇదొక హఠాత్మరిణామం అంటూ..సారి రా అబ్బయిలు అని గ్రూప్ నుంచి వెళ్లిపోవడంతో సాయి ధరమ్ తేజ్ కూడా ఉహీంచని విధంగా మెస్సేజ్ ఇచ్చాడు. ఇప్పుడు నా షో టైమ్ వచ్చింది. సారి ప్రభాస్ అన్నా.. అని కామెంట్ చేసినట్లు ఉంది. మరిన్ని వివరాల కోసం ఆగస్టు 24 రోజున 10గంటల వరకు వెయిట్ చేయాల్సిందే అని సాయి చెప్పడంతో పెళ్లి ఘడియలు దగ్గరపడినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











