బిల్డప్ ఇచ్చి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్.. పెళ్లి అనుకుంటే..

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ అనుమానాలనే నిజం చేశాడు. పెళ్లి అనుకుంటే.. కాదు ప్రమోషన్ స్టంట్ అని తేల్చేశాడు. సాయి ధరమ్ ఇచ్చిన బిల్డప్ కి చాలా మంది మెగా ఫ్యామిలీలో మరో వేడుక మొదలవ్వబోతోంది అంటూ సోషల్ మీడియాలో అనేక రకాల కామెంట్స్ చేశారు. ఈ విషయంపై చాలా వరకు మీడియాలలో కూడా అనేక రకాల కథనాలు వెలువడ్డాయి.

Recommended Video

Ravi Teja & Sai Dharam Tej To Team Up For Multi-Starrer
పెళ్లి బట్టలతో దర్శనం ఇవ్వడంతో

పెళ్లి బట్టలతో దర్శనం ఇవ్వడంతో

ఇటీవల కాలంలో వరుసగా స్టార్ హీరోలు పెళ్లికి సిద్ధమవ్వడం అందరిని కొంత వరకు ఆశ్చర్యాన్ని కలిగించింది. బ్యాచిలర్ లైఫ్ కి ఎండ్ కార్డ్ వేసి పెళ్లి బట్టలతో దర్శనం ఇవ్వడంతో వారికి సంబంధించిన అనేక రకాల ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రానా, నితిన్, నిఖిల్ పెళ్లి వేడుకలు ఎంత సింపుల్ గా జరిగాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

పెళ్లి అని అంతా అనుకున్నారు..

పెళ్లి అని అంతా అనుకున్నారు..

అయితే అదే తరహాలో సాయి ధరమ్ తేజ్ కూడా పెళ్లి చేసుకొనున్నాడు అని వార్తలు రావడం మొదలయ్యాయి. ఎందుకంటే నిన్న సాయి ఒక వాట్సాఫ్ కి సంబంధించిన వీడియోతో ఊహించని విధంగా సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఒక్కోసారి మనం ఎన్నో అనుకుంటాం కానీ ఆ టైమ్ వచ్చినప్పుడు మరి.." అని ట్వీట్ చేసిన విధానం చూస్తుంటే పెళ్లి విషయం చెప్పబోతున్నాడని అంతా భావించారు.

 సినిమా కోసం..

సినిమా కోసం..

కానీ నేడు ఉదయం కొంత అనుమానించినట్లుగానే మెగా హీరో షాక్ ఇచ్చాడు. సోలో బ్రతుకే సో బెటర్ కి సంబంధించిన అప్డేట్ అందిస్తూ.. అందులో కథానాయకుడు సోలో లైఫ్ కి ఎండ్ కార్డ్ పెట్టేసి అమ్మాయి వెనకాలా పడితే ఏమవుతుంది అనేలా ట్వీట్ చేసి సాంగ్ అప్డేట్ ఇచ్చాడు.

అప్డేట్ చూసిన అభిమానులు..

అప్డేట్ చూసిన అభిమానులు..

అంత స్ట్రిక్ట్ గా సోలో బ్రతుకు సో బెటర్ అని అందరికీ చెప్పే విరాట్ కి అమృత ని చూసాక ఏమైంది ??? అంటూ హే ఇది నేనేనా అనే సాంగ్ ని ఆగస్ట్ 26న 10గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు వివరణ ఇచ్చాడు. అప్డేట్ చూసిన అభిమానులు పర్సనల్ విషయం అనుకున్నాము అంటూ ట్విట్టర్ లో కామెంట్స్ చేస్తున్నారు.

సందీప్ కిషన్ కూడా

సందీప్ కిషన్ కూడా

ఏదేమైనా సాయి ధరమ్ తేజ్ ఇచ్చిన బిల్డప్ చూసి నిజంగా కొందరు షాక్ అయ్యారనే చెప్పాలి. కొన్ని రోజుల క్రితం ఇదే తరహాలో సందీప్ కిషన్ కూడా తన లైఫ్ కి సంబంధించిన ఒక కీలక నిర్ణయం చెప్పబోతున్నట్లు చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు. అందరూ పెళ్లి న్యూస్ చెబుతున్నాడు అని అనుకున్నారు. కానీ సరికొత్త ప్రొడక్షన్ హౌజ్ ని స్థాపించి సినిమాను ఎనౌన్స్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X