మెగా సందేశం.. గొప్పలు చెప్పుకోవడానికి కాదు.. సుప్రీమ్ హీరో ఎమోషనల్ వీడియో
తమ అభిమాను హీరో పుట్టిన రోజంటే.. ఫ్యాన్స్‌కు అదే పెద్ద పండుగ. అయితే తమ అభిమానులు చేసిన పనులకు కొందరు హీరోలు ఆనందిస్తుంటారు. అన్నదానాలు, రక్తదానాలు ఇలా ఫ్యాన్స్ చేసే సేవా కార్యక్రమాలను ప్రోత్సహిస్తుంటారు.
నేడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్.. తన పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఎంతో మంది అభిమానులు ఎక్కడినుంచో తన దగ్గరకి వస్తున్నారని, విషెస్ చెబుతున్నారని తెలిపాడు. ఈ సందర్భంగా తనకు ఓ ఆశ్రమాన్ని బాగు చేయాల్సిందిగా సోషల్ మీడియాలో ఎవరో తనను అడిగారని చెప్పుకొచ్చాడు.

ఈ సందర్భంగా ఓ సందేశాత్మక వీడియోను విడుదల చేస్తూ కొన్ని విషయాలను వెల్లడించాడు. ఈ రోజు మా అభిమానులు ఎంతో మంది మంచి కార్యక్రమాలు చేస్తున్నారు.. అయితే ఇలా తాత్కాలికమైన సహాయాలు కాకుండా ఒక సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపుదామని ఫ్యాన్స్‌ను కోరాడు. ఓ వృద్దాశ్రమాన్ని నిర్మించమని.. అడిగారు.. అయితే తన ఫ్లెక్సెస్ కోసం ఖర్చు పెట్టేవి తనకు ఇవ్వమని.. అవన్నీ తాను ఆ ఓల్డేజ్ హోమ్ వాళ్లకు ఇస్తానని చెప్పుకొచ్చాడు. ఇలా అడగడంతో కొంత మంది ఇచ్చారని.. అది దాదాపు లక్ష వరకు వచ్చాయని అవన్నీ ఆశ్రమానికి ఇచ్చానని.. ఒక ఏడాదంతా దాని ఖర్చును తానే భరిస్తానని ప్రకటించాడు. ఫ్యాన్స్ ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అని అన్నాడు.
ఇవేవో గొప్పలు చెప్పుకోవడానికి కాదు.. నన్ను చూసి ఎవరోకరు స్ఫూర్తి పొందాలని.. సోషల్ మీడియా వేదికగా చెబుతున్నాను.. ఎవరూ తప్పుకో తీసుకోవద్దు అంటూ ముగించాడు. ఈ హీరో ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ప్రతిరోజూ పండగే చిత్రాన్ని చేస్తున్నాడు. రీసెంట్‌గా సోలో బతుకే సో బెటర్ అనే చిత్రాన్ని ప్రారంభించాడు. ఈ మూవీలో నభా నటేష్ హీరోయిన్‌గా నటించనుంది.


Click it and Unblock the Notifications











