రామ్ చరణ్ దర్శకుడితో సాయి ధరమ్ తేజ్ మూవీ.. స్టార్ హీరోయిన్‌తో జోడీ.. ఇదే తొలిసారి!
పిల్ల నువ్వు లేని జీవితం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు సాయిధరమ్ తేజ్. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన తేజు... ఆ తర్వాత రేయ్ సినిమా అంతగా ఆకట్టుకోలేక పోయినా... సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాతో కమర్షియల్ హిట్ అందుకున్నాడు. మెగాస్టార్ అల్లుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ.. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. విభిన్న సినిమాలు చేస్తూ... సుప్రీం హీరోగా ఎదిగాడు. ఈ ఏడాది విరూపాక్ష సినిమాతో మంచి హిట్ సొంతం చేసుకున్న తేజు.. తన నెక్ట్స్ మూవీపై అప్ డేట్ వచ్చింది. వివరాల్లోకి వెళ్తే...
విరూపాక్షతో లైన్ లోకి వచ్చిన తేజు : మెగా కంపౌండ్ నుంచి సాయి ధరమ్ తేజ్ వచ్చినప్పటికీ.. తనకంటూ ఓ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. సుకూమార్ శిష్యూడు కార్తిక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన విరూపాక్ష మూవీలో నటించిన తేజు... సూపర్ హిట్టును సొంతం చేసుకున్నాడు. చాలా రోజుల తర్వాత మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడు. ప్రస్తుతం తేజ్ తన మావయ్య పవన్ కల్యాణ్ తో నటిస్తున్న మూవీ బ్రో సెట్స్ మీద ఉన్న సంగతి తెలిసిందే.


ఈసారైనా హిట్టు కొట్టాలనే తపనతో : అయితే గత కొంత కాలంగా ఈ దర్శకుడికి సరైన హిట్స్ లేవు. అప్పుడెప్పుడో హీరో గోపిచంద్ తో కలిసి సిటీమార్ సినిమా తెరకెక్కించాడు. కానీ ఆ సినిమా అనుకున్న స్థాయిలో బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించలేదు. ఇప్పుడు తాజాగా ఈ దర్శకుడికి హీరో దొరికినట్లు తెలుస్తోంది. విరూపాక్ష సినిమాతో లైన్ లోకి వచ్చి సాయిధరమ్ తేజ్ తో ఈ డైరెక్టర్ సినిమా చేయబోతున్నారని సమాచారం.


తొలిసారి జత కట్టనున్న హీరోయిన్ : అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే, శ్రీలీల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం వీరిద్దరిలో ఒకరిని ఎంపిక చేయనున్నారట. వీళ్లలో సాయి ధరమ్ తేజ్ తో ఎవరు జత కట్టిన వారికి తేజుతో మొదటి సినిమానే అవుతుంది. ఇక ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ బ్రో సినిమా షూటింగ్ లో బిజి బిజిగా గడుపుతున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











