తనే వదిలేసి వెళ్లిపోయింది... బ్రేకప్ స్టోరీ బయటపెట్టిన మెగా హీరో

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రస్తుతం సినీనటులంతా పెళ్లిళ్లు ఇతర గుడ్‌న్యూస్ చెబుతూ అభిమానులకు ఖుషీ చేస్తున్నారు. ఇన్నాళ్లూ సీక్రెట్‌గా ఎఫైర్ నడిపిన వాళ్లు తమ ప్రేమను బయటపెడుతున్నారు. అయితే కొందరు మాత్రం ఇంకా బ్యాచిలర్స్‌గానే ఉండిపోతున్నారు. టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్‌లో ఒకరిగా నిలిచారు మెగా హీరో సాయిధరమ్ తేజ్. ఎన్నిసార్లు పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చినా చిరునవ్వు నవ్వి వెళ్లిపోతారు సాయి. అయితే కొద్దిరోజుల క్రితం తనకి ఒక బ్రేకప్ జరిగిందని బయటపెట్టి ఎమోషనల్ అయ్యారు. ఈ వివరాల్లోకి వెళితే..

మెగాస్టార్ చిరంజీవి అడుగుజాడల్లో ఆయన మేనల్లుడు సాయధరమ్ తేజ్ కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. మెగా బ్రాండ్‌తో ఎంట్రీ ఇచ్చినప్పటికీ తన నటన, స్టైల్‌తో తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్నాడు సాయి. 2014లో పిల్లా నువ్వులేని జీవితం సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు సాయిధరమ్ తేజ్. అనంతరం రేయ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీం, తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటెలిజెంట్, తేజ్ ఐ లవ్ యూ, చిత్రలహరి, ప్రతిరోజూ పండగే, సోలో బ్రతుకే సో బెటర్, రిపబ్లిక్, విరూపక్ష, బ్రో తదితర సినిమాలలో నటించారు. ప్రస్తుతం సంబరాల ఏటి గట్టు సినిమాలో సాయితేజ్ నటిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Sai Dharam Tej Opens Up About Painful Breakup Says Media Rumours Ruined His Relationship

హీరోగా మంచి ఊపు మీదున్న దశలో యాక్సిడెంట్ కావడం సాయితేజ్ జోరుకు బ్రేక్ వేసింది. ఆ ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడినప్పటికీ తీవ్రగాయాలు కావడంతో కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఆ తర్వాత వరుస హిట్స్ కొడుతూ తిరిగి ట్రాక్‌లోకి వచ్చారు సాయితేజ్. అందరి హీరోల మాదిరిగానే సాయిధరమ్ తేజ్‌పైనా ఎన్నో రూమర్స్ వచ్చాయి. తమిళ నటి రెజీనాతో ఆయన రిలేషన్‌లో ఉన్నట్లుగా గాసిప్స్ వైరల్ అయ్యాయి. వీరిద్దరూ కలిసి జంటగా ఎక్కువ సినిమాలు చేయడమే దీనికి కారణం. అయితే తమ మధ్య ఎలాంటి బంధం లేదని రెజీనాతో పాటు సాయితేజ్ కూడా ఖండించారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన ఓ సదస్సులో పాల్గొన్న సాయిని పెళ్లి గురించి అడగ్గా.. దానికి ఆసక్తికర సమాధానంతో పాటు బ్రేకప్ స్టోరీని బయటపెట్టారు సాయిధరమ్ తేజ్.

అది చాలా పెయిన్‌తో కూడిన బ్రేకప్ స్టోరీ. 2023లో నాకు బ్రేకప్ జరిగింది. ఇప్పటి వరకు నాకు జరిగిన బ్రేకప్స్‌లో అదే అత్యంత బాధాకరమైనది. మీడియా వల్లే మేము విడిపోవాల్సి వచ్చింది. మీడియా వాళ్లు నా మీద చాలా ప్రేమతో సినిమా హిట్ అవ్వగానే ఈ అమ్మాయితో పెళ్లి, ఆ అమ్మాయితో పెళ్లి.. నెల రోజుల్లో పెళ్లి అని గ్యాప్ లేకుండా రాసేస్తారు. ఇలాంటి వాటి వల్లే నాకు బ్రేకప్ జరిగింది. ఆ అమ్మాయి నా కాలేజీ గర్ల్‌ఫ్రెండ్. మీడియాలో నా గురించి వచ్చిన పుకార్లు చూసి తను తట్టుకోలేకపోయింది. మీ అందరూ కాస్త సైలెంట్‌గా ఉంటే నా పెళ్లి జరిగిపోయేది. నా పెళ్లి జరిగితే నేనే స్వయంగా అనౌన్స్ చేస్తానని సాయిధరమ్ తేజ్ పేర్కొన్నారు.

అయితే గతంలో విరూపక్ష సినిమా ప్రమోషన్స్ టైంలోనూ తన వ్యక్తిగత జీవితం, రిలేషన్స్‌పై మాట్లాడారు సాయిధరమ్ తేజ్. గతంలో తాను ఓ అమ్మాయిని ప్రేమించా. బ్రేకప్ జరిగింది.. ఆ తర్వాత సైలెంట్ అయిపోయాను. ఎవరో అడుగుతున్నారని నేను పెళ్లి చేసుకోను.. నాకు కరెక్ట్‌గా సెట్ అయితేనే చేసుకుంటానని సాయిధరమ్ తేజ్ తేల్చేశారు. ప్రస్తుతం ఆ పాత వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X