పులి పిల్లలతో సాయి ధరమ్ తేజ్… వేదాంతం మాట్లాడుతున్నాడే !
ఒకప్పుడు వరుసగా డిజాస్టర్స్ అందుకున్న సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం మంచి సినిమాలు ఎంచుకుంటూ హిట్స్ కొడుతున్నాడు. 2019లో కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రలహరి సినిమాతో హిట్స్ అందుకోవడం మొదలుపెట్టిన తేజ్ అదే ఏడాది చివర్లో మారుతి దర్శకత్వంలో వచ్చిన ప్రతి రోజు పండుగే సినిమాతో ఆ హిట్స్ పరంపర కొనసాగించాడు. ఇక గత ఏడాది చివర్లో రిలీజ్ అయిన సోలో బ్రతుకే సో బెటరూ సినిమా కూడా హిట్ కావడంతో వరుసగా హ్యాట్రిక్ హిట్స్ సాధించి ఇప్పుడు మరో హిట్ సాధించేందుకు ఉవ్విళ్ళూరుతున్నాడు..
ప్రస్తుతానికి ఆయన క్రియేటివ్ డైరెక్టర్ దేవకట్టా దర్శకత్వంలో రిపబ్లిక్ అనే సినిమా చేస్తున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆయన ఒక ఐఏఎస్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ మధ్య కాలం లో రిలీజ్ అయిన టీజర్ ఈ సినిమా మీద భారీ అంచనాలు పెంచింది. ఇక ఆ విషయం పక్కన పెడితే తాజాగా సాయి ధరంతేజ్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసిన ఒక పిక్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆయన పెద్దగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడు ఎప్పుడో అమావాస్య, పౌర్ణమికి ఒక పోస్ట్ పెడుతూ ఉంటాడు.

తాజాగా రెండు పులి పిల్లలతో ఫోటో దిగిన తేజ్ దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈరోజు ఎర్త్ డే సందర్భంగా ఆ పిల్లలతో దిగిన ఫోటోలు సాయితేజ్ పోస్ట్ చేశాడు. అలాగే పోస్ట్ చేసి live and let live అనే కామెంట్ పెట్టి వేదాంతం మాట్లాడుతూ కాస్త ప్రకృతితో కూడా మనం కలిసిపోవాలని చెప్పుకు రావడం ఆసక్తికరంగా మారింది. ఇక సినిమాల విషయానికి వస్తే సాయి ధరం తేజ్ రిపబ్లిక్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఇప్పటికే కార్తీక్ అనే కుర్ర దర్శకుడి దర్శకత్వంలో ఒక సినిమా ఒప్పుకున్నాడు. అలానే మరో సుకుమార్ శిష్యుడు దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు అనే ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











