మేనమామ కోసం తిరుమలకు సాయిధరమ్ తేజ్.. అర్ధరాత్రి కాలి నడకన మొక్కు తీర్చుకొన్న మేనల్లుడు

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. తన మేనమామ పవన్ కల్యాణ్ ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతోపాటు డిప్యూటీ సీఎంగా పదవీ చేపట్టడంతో ఆనందంలో మునిగిపోయాడు. అంతేకాకుండా తన మేనమామ విజయం సాధించాలని మొక్కుకొన్న ఆయన తన కోర్కెను తీర్చుకొన్నారు. తిరుమలను కాలినడకన చేరుకొన్న ఆయన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

హీరో సాయిధరమ్ తేజ్ ఇటీవల కాలంలో చాలా విషయాలతో వార్తల్లో హైలెట్‌గా నిలిచారు. పవన్ కల్యాణ్ ఇటీవల విజయం సాధించడంతో ఆయన ఇంటికెళ్లి రచ్చ చేశాడు. తన మేనమామను గాఢంగా కౌగిలించుకొన్ని.. గాల్లోకి ఎత్తుకొని తన సంతోషాన్ని చాటుకొన్నారు. తన హృదయంలోని పొంగుకొచ్చిన ఆనందాన్ని తన మామతో పంచుకొన్నారు.

Sai Dharam Tej reached Tirumala by walk for Pawan Kalyan Victory

ఇక జనసేనకు వ్యతిరేకంగా తన స్నేహితుడి కోసం అల్లు అర్జున్ వైసీపీ పార్టీకి సపోర్ట్ చేయడంపై మెగా ఫ్యామిలీతోపాటు అభిమానుల్లోను తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ క్రమంలో సాయిధరమ్ తేజ్ ఇటీవల అల్లు అర్జున్, స్నేహారెడ్డిని సోషల్ మీడియాలో అన్ ఫాలో కావడం సంచలనం రేపింది. మీడియాలో ఈ విషయం వైరల్ అయింది.

ఇవన్నీ పక్కన పెడితే.. పవన్ కల్యాణ్ విజయం సాధిస్తే.. కాలినడకన తిరుపతి వస్తానని మొక్కుకొన్న ఆయన శుక్రవారం రాత్రి అలిపిరి నుంచి కాలినడకన తిరుమల చేరుకొని మొక్కు చెల్లించుకొన్నాడు. ఆయన నడకదారిలో చేతిలో కర్ర పట్టుకొని తన సిబ్బంది, ఫ్రెండ్స్‌తో కలిసి తిరుమల చేరుకొన్నారు.

ఇటీవల యాక్సిడెంట్ తర్వాత పలు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న సాయిధరమ్ తేజ్.. అవన్నీ పక్కన పెట్టి.. దేవుడి మొక్కు చెల్లించుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. కాలినడకన తన అభిమానులతో ఫోటోలు దిగుతూ ఉత్సాహంగా కొండపైకి చేరుకొన్నారు. తిరుమల వీఐపీ దర్శనం చేసుకొన్నట్టు తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X