Sai Dharam Tej: హాస్పిటల్ బెడ్ టు పెళ్లి పీటలు.. ఆ పోస్ట్ కి అర్ధం అదేనా.. మెగాఅభిమానులు ఏమంటున్నారంటే?
ఇటీవలే రోడ్డు ప్రమాదానికి గురైన సాయితేజ్ పూర్తిగా కోలుకొని విజయ దశమి సందర్భంగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు తమ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు. అదేరోజు సాయి తేజ్ పుట్టిరోజు కూడా ఉండటంతో మెగా ఫ్యామిలీలో ఆనందం మరింత రెట్టింపయింది. అయితే సాయి ధరమ్ తేజ్ పెళ్లి గురించి ఇప్పుడు ఆసక్తికర చర్చ మొదలైంది. ఆ వివరాల్లోకి వెళితే

వెల్‌కం హోం అంటూ
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారని ప్రచారం మొదలైంది. ఆయన త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారన్నట్టు సందేహం కలిగేలా కొన్ని విషెస్ రావడంతో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ లిస్ట్ నుంచి త్వరలోనే తప్పుకోనున్నారా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఎందుకంటే తేజ్ పుట్టిన రోజు సందర్బంగా మెగా ఫ్యామిలీలో అందరూ అతనికి వెల్‌కం హోం అంటూ బర్త్‌డే విషెస్‌ను తెలిపారు.

ఆట పట్టించాలని?
ఇందులో సుష్మిత కొణిదెల, శ్రీజ, నిహారిక, అల్లు శిరీష్ సహా మిగతా కజిన్స్ సైతం తేజ్‌కు ఎంతో ప్రేమగా విషెస్ చెప్పారు. అయితే అల్లు శిరీష్ మాత్రం సింగిల్‌గా ఇదే నీ చివరి బర్త్‌డే అవ్వాలనుకుంటున్నా. ఈ మ్యారేజ్ రేస్‌లో నువ్వు నన్ను బీట్ చెయ్యాలనుకుంటున్నా అని సాయి తేజ్ పెళ్లిపై హింట్ ఇచ్చేశాడు. అయితే ఈ ప్రకటనలో క్లారిటీ లేదు, దీంతో సాయి తేజ్ ని ఆట పట్టించాలని శిరీష్ అలా రాశారు అని అభిమానులు అనుకుంటున్నారు.

సాయి తేజ్ పెళ్లిపై క్లారిటీ
అయితే ఏదేమైనా శిరీష్ కామెంట్స్ తో సాయి తేజ్ పెళ్లి మ్యాటర్ ని తిరిగి వెలుగులోకి తెచ్చింది. దీంతో ఇప్పటికే సంబంధాలు చూస్తున్నారని, త్వరలోనే సాయి తేజ్ పెళ్లిపై క్లారిటీ రానుందని మెగా ఫ్యాన్స్ లో అయితే చర్చ జరుగుతోంది. అయితే సోలో బ్రతుకే సో బెటర్ విడుదల సమయంలో సాయి తనకు ఇప్పుడే సెటిల్ అయ్యే ఆలోచన లేదని తన పెళ్లిని వీలైనంత ఆలస్యం చేస్తున్నానని వెల్లడించాడు.

బాధ పడుతూ
సాయి ధరమ్ తేజ్ కుటుంబం, ప్రత్యేకించి సాయి తల్లి ఆయన వివాహం చేసుకోవాలని కోరుకుంటోందని, తద్వారా వీలైనంత త్వరగా సాయి ఒక ఫ్యామిలీగా మారాలని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత, అతని కుటుంబం కొంతకాలంగా ఆ విషయంలో చాలా బాధ పడుతున్నట్లు కనిపిస్తుంది.
Recommended Video

ఫిజియోథెరపీ
ప్రస్తుతానికి సాయి ధరమ్ ఫిజియోథెరపీ చేయించుకుంటున్నారు. ఈ ప్రమాదం నుంచి కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సాయి ధరమ్ చివరిగా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌లో తాను కోలుకుంటున్నట్లు పేర్కొన్నాడు, ప్రార్థనలు చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల సాయి ధరమ్ తేజ్ నటించిన 'రిపబ్లిక్' సినిమా రిలీజ్ కాగా సినిమా అందరి ప్రశంసలు అందుకుని, బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. అతను పూర్తిగా కోలుకున్న తర్వాత తన రాబోయే సినిమాల షూటింగ్ ప్రారంభిస్తాడని అంటున్నారు. మరి చూడాలి ఈ పెళ్లి వ్యవహారం ఎందాకా వెళుతుంది అనేది.


Click it and Unblock the Notifications











