యాక్సిడెంట్ తరువాత మొట్టమొదటిసారి స్పందించిన సాయి ధరమ్ తేజ్.. వాళ్ళ వల్లే కోలుకున్నానంటూ వీడియో
మెగా హీరో సాయిధరమ్ తేజ్ గతేడాది సెప్టెంబర్‌లో బైక్ యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. మాదాపూర్‌లో బైక్ మీద వెళుతూ అనుకోని పరిస్థితులలో స్కిడ్ అయ్యి తీవ్ర గాయాలపాలపైన తేజును, వెంటనే స్థానిక మెడికవర్ ఆసుపత్రిలో చేర్పించి, ఆ తరువాత అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుని కోలుకున్న సాయి ధరమ్ తేజ్ ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చిన దాఖలాలు లేవు. అయితే తాజాగా సాయి ధరమ్ తేజ్ ఒక వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో ఆయన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

తేజ్ ధన్యవాదాలు
రోడ్డు ప్రమాదం బారిన పడి అపోలో హాస్పిటల్ లో చేరి కొన్ని శస్త్ర చికిత్సలు చేయించుకున్న తర్వాత సాయి ధరమ్ తేజ్ కొంత కోలుకున్నాడు. కాస్త కోలుకున్న తరువాత తేజుకు ఇంటి వద్దే చికిత్స ఇప్పిస్తూ వచ్చారు. అయితే తాజాగా ఈ హీరో తాను కోలుకున్నట్లు తన అభిమానులకు తెలిపేందుకు ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశాడు. తనకు యాక్సిడెంట్ అయినప్పుడు తనను ఆసుపత్రిలో చేర్పించిన వ్యక్తికి ఈ వీడియో ద్వారా తేజ్ ధన్యవాదాలు తెలిపాడు.

గుడ్ న్యూస్
ఆ తర్వాత తనను వెంటనే జాయిన్ చేసిన మెడికవర్ హాస్పిటల్లోని వైద్యులకు సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలిపాడు. ఆ తర్వాత తనను చాలా కాలం పాటు హాస్పిటల్లో ఉంచుకుని పూర్తిగా చికిత్స చేసిన అపోలో ఆసుపత్రి వైద్యులకు, తన కుటుంబ సభ్యులకు, తన మేనమాలు చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు. వారు చూపించిన ప్రేమతోనే తాను ఈరోజు ఇలా క్షేమంగా ఉన్నానంటూ సాయి ధరమ్ తేజ్ చెప్పుకొచ్చాడు. ఇక తన అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పేందుకే ఈ వీడియో చేస్తున్నట్లు కూడా తేజ్ తెలిపాడు.

సుకుమార్, బాబీలు
ఈ నెల 28న తన కొత్త సినిమా ప్రారంభం అవుతుందని.. సుకుమార్, బాబీలు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు అని తేజు చెప్పుకొచ్చాడు. త్వరలోనే మళ్లీ అందరి ముందుకు వస్తానని వీడియో ద్వారా సాయి ధరమ్ తేజ్ సందేశం ఇచ్చాడు. ఇక బైక్‌పై వెళ్లే ప్రతిఒక్కరూ తప్పక హెల్మెట్ ధరించాలని ఆయన ఈ సందర్భంగా ప్రతి ఒక్కరినీ అభ్యర్థించారు.

ఆరోగ్యం మీద దృష్టి
చాలా కాలంగా ఇంట్లోనే ఉండటం వల్ల అనేక విషయాలు నేర్చుకున్నాను అని ముఖ్యంగా ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం కోసం బాగా సమయం దొరికిందని సాయి ధరంతేజ్ చెప్పుకొచ్చారు. చివరిగా దేవా కట్టా దర్శకత్వంలో వచ్చిన రిపబ్లిక్ అనే సినిమాతో సాయి ధరంతేజ్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమాలో సాయి ధరంతేజ్ కలెక్టర్ పాత్రలో నటించగా ఆ పాత్ర చివరిలో చనిపోవడంతో తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా పెద్దగా ఎక్కలేదు. ప్రస్తుతానికి ఈ సినిమా అయిపోయే జి ఫైవ్ యాప్ లో అందుబాటులో ఉంది.
సినిమా అప్డేట్ ఇచ్చేందుకు
మరోపక్క తన సినిమా అప్డేట్ ఇచ్చేందుకు విడుదల చేసిన వీడియోలో తేజ్ ఇంకా నీరసంగానే కనిపిస్తుండటంతో అభిమానులు ఇంకా కోలుకో లేదా అంటూ ఆందోళన చెందుతున్నారు. ఏదేమైనా ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి తమ అభిమాన హీరో కోలుకోవడం సంతోషంగా ఉందని మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతేనేం 28వ తారీఖున సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా ప్రారంభం కాబోతోంది అన్నమాట.


Click it and Unblock the Notifications











