సాయి ధరమ్ తేజ్ క్రేజ్.. ‘రిపబ్లిక్’ సెట్ వద్ద ఫ్యాన్స్ రచ్చ!
మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌కు బయట ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా సుప్రీమ్ హీరో క్రేజ్ పెరుగుతూనే వస్తోంది. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న తరుణంలోనూ సాయి ధరమ్ తేజ్‌కు అభిమానులు అండగానే ఉన్నారు. అయితే ఎట్టకేలకు చిత్రలహరి సినిమాతో హిట్ ట్రాకు ఎక్కాడు సాయి ధరమ్ తేజ్. ఆ తరువాత ప్రతి రోజూ పండుగే చిత్రం గాడిలో పడ్డాడు.
చివరగా సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ అంటూ దుమ్ములేపాడు. కరోనా అంటూ అందరూ భయపడుతున్న తరుణంలో ముందడుగు వేశాడు. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టాడు. అలా సోలో బ్రతుకే సో బెటర్ హిట్ అవ్వడంతో మరింత కాన్ఫిడెన్స్ వచ్చింది. అందుకే వెంటనే కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించేశాడు. దేవా కట్ట దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ ఓ ప్రాజెక్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

రిపబ్లిక్ అంటూ వదిలిన సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ఓ రేంజ్‌లో వైరల్ అయింది. ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ నల్గోండ జిల్లాలోని దేవరకొండ గ్రామంలో జరుగుతోంది. అయితే అక్కడకు సుప్రీమ్ హీరో వచ్చాడని తెలిసి అభిమానులు గుమిగూడారు. సెల్ఫీలంటూ అభిమానులు రచ్చ రచ్చ చేశారు. అయినా సరే వీలైనంత మందికి సెల్ఫీలు ఇచ్చాడు. ఇక మెగా నినాదాలతో ఆ ప్రాంగణమంతా మార్మోగిపోయింది. రిపబ్లిక్ చిత్రంలో జగపతి బాబు, ఐశ్వర్యా రాజేశ్ వంటి వారు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











