Sai Dharam Tej చేతులెత్తి మొక్కుతున్నా.. హెల్మెట్ పెట్టుకొని బైక్ నడపండి.. సాయిధరమ్ తేజ్

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణ సారథ్యంలో బాపినీడు బీ సమర్పించిన చిత్రం రంగ రంగ వైభవంగా. మెగా హీరో వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ జంటగా నటించిన ఈ చిత్రానికి దర్శకుడు గిరీషయా. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం, శ్యామ్ దత్ సునీద్దీన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 2వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. యాక్సిడెంట్ తర్వాత తొలిసారి ఈ వేడుకలో సాయిధరమ్ తేజ్ ముఖ్య అతిథిగా కనిపించారు. ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ ఎమోషనల్‌గా మాట్లాడుతూ..

Sai Dharam Tej

సెప్టెంబర్ 2న మనకు ఇంకో పండుగ. మన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు. మీకు పవర్ స్టార్ అయితే నాకు ఆయన గురువు గారు. సెప్టెంబర్ 2వ తేదీన సినిమా చూసి బర్త్ డే పార్టీ చేసుకోండి అని సాయిధరమ్ తేజ్ అన్నాడు.

మీరంతా ఇంటికి వెళ్తుంటారు. మీరు బైక్ నడిపేటప్పుడు.. హెల్మెట్ వేసుకొని బైక్ నడపండి. మీరు పక్కింటికి వెళ్లినా కూడా హెల్మెట్ పెట్టుకొని వెళ్లండి. నేను హెల్మెట్ పెట్టుకొన్న కాబట్టి యాక్సిడెంట్ జరిగినా బతికి బయటపడ్డాను. కాబట్టి మీకు చేతులు ఎత్తి మొక్కుతున్నాను. హెల్మెట్ లేకుండా బండి నడపకండి. ప్లీజ్.. ప్లీజ్ హెల్మెట్ వేసుకోండి. రోడ్డుపైన ఇసుక ఉంటే ఎవరు ఏం చేస్తారు. విధిరాతను ఎవరు మార్చలేరు. కాబట్టి మీరు హెల్మెట్ వేసుకోండి అని సాయిధరమ్ అన్నారు.

సెప్టెంబర్ 2 తేదీన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే. రంగ రంగ వైభవంగా సినిమా యూనిట్ తరఫున.. మీ తరఫున హ్యాపీ బర్త్ డే పవన్ కల్యాణ్ అని విషెష్ చెబుతున్నాను. రంగ రంగ వైభవంగా సినిమాను థియేటర్లో చూడండి అని సాయిధరమ్ తేజ్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X