ఆకట్టుకుంటున్న మెగా హీరో 'సింగల్ ఛాలెంజ్'!
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం చిత్రలహరి చిత్రంతో బిజీగా ఉన్నాడు. నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న సాయిధరమ్ తేజ్ ఈ చిత్రం చాలా కీలకం కానుంది. ఇదిలా ఉండగా తేజు ఇటీవల చేసిన ఓ ట్వీట్ నెటిజన్లని బాగా ఆకట్టుకుంటోంది. వాలంటైన్స్ డే వీక్ మొదలు కావడంతో ప్రేమికులంతా ఆ హంగామాలో మునిగిపోయారు.
ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేస్తూ.. 1999 సింగిల్, 2009 అఎహే సింగిలే.. 2019.. అయినా కానీ సింగిలే.. మీరంతా ఇంకా సింగల్ గానే ఉంటున్నారా.. అయితే రండి సింగిల్ గా వాలంటైన్స్ డే జరుపుకుందాం అని సాయిధరమ్ తేజ్ పిలుపునిచ్చాడు. దీనికి సాయిధరమ్ తేజ్ సింగల్ ఛాలెంజ్ అనే హ్యాష్ టాగ్ కూడా జత చేశాడు.

ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక తేజు నటిస్తున్న చిత్రలహరి చిత్రం కూడా ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్, నివేత పెతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. మైత్రి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.


Click it and Unblock the Notifications











