Sai Durga Tej నిర్మాతగా మారిన సాయిధరమ్ తేజ్.. తల్లి పేరుతో నిర్మాణ సంస్థ.. ఆ నలుగురి ఆశీస్పులతో!
టాలీవుడ్ హీరో సాయిధరమ్ తేజ్ అలియాస్ సాయిదుర్గ తేజ్ సంచలన నిర్ణయం తీసుకొన్నాడు. ఇప్పటి వరకు నటుడిగా కొనసాగిన ఆయన ప్రస్తుతం నిర్మాతగా మారబోతున్నట్టు ప్రకటించారు. తన తల్లి పేరు మీద సొంత బ్యానర్ స్థాపించి తన మేనమామలు చేతులు మీదుగా బ్యానర్‌ను ఆవిష్కరించారు. ఈ విషయాన్ని సాయిదుర్గ తేజ్ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేసి.. ఫోటోలు షేర్ చేశారు. ఈ బ్యానర్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
తాజాగా సాయిధరమ్ తేజ్, కలర్స్ స్వాతి నటించిన సత్య షార్ట్ ఫిలిం ప్రీమియర్ షో ఇటీవల హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ప్రదర్శించారు. ఈ సినిమా అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నా పేరును సాయిధరమ్ తేజ్ నుంచి సాయిదుర్గ తేజ్ అని మార్చుకొన్నాను. నాకు మా అమ్మ పునర్జన్మను ఇచ్చింది. కాబట్టి నా పేరు ఇక నుంచి సాయిదుర్గ తేజ్ అని చెప్పాడు.

సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరి పేరులో తండ్రి పేరు ఇంటి పేరుతో కలిసి ఉంటుంది. నా తల్లి నా జీవితంలో భాగం కావాలని నా పేరును సాయిదుర్గ తేజ్‌గా మార్చుకొన్నాను. నా తల్లి నాతోపాటు నా లైఫ్‌లో ఎప్పటికీ ఉంటుంది. అలా ఉండాలనే నేను పేరు మార్చుకొన్నాను. అంతకంటే ఏమీ విషయం మరోటి లేదు అని సాయిధరమ్ తేజ్ తెలిపాడు.

ఇదిలా ఉండగా, తన తల్లి పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థను పెడుతున్నట్టు సాయిధరమ్ తేజ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. నా జీవితంలో కొత్త ఆరంభం. నా తల్లికి చిన్న గిఫ్ట్. ఆమె పేరుతో విజయ్ దుర్గ ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించానని చెప్పడానికి హ్యాపీగా ఉంది అని సాయిధరమ్ తేజ్ తన ట్విట్‌లో తెలిపారు.


ఈ శుభకార్యాన్ని నా శ్రేయస్సును ఆకాక్షించే మా మామయ్యలు మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, నా గురువు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, నా కెరీర్‌కు ఆరంభంలో సపోర్ట్ చేసి దిల్ రాజు చేతుల మీదుగా ప్రారంభిస్తున్నాను. నా స్నేహితుడు రూపొందించిన సత్య సినిమా లాంచ్ సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం హ్యాపీగా ఉంది. ఈ బ్యానర్ నుంచి ఇంకా చాలా సినిమాలు వస్తుంటాయి అని సాయి ధరమ్ తేజ్ చెప్పారు.


Click it and Unblock the Notifications











