మమల్ని ద్వేషిస్తే అదే చేస్తాం.. ఆ ప్రచారం చేసేది ఎవరో తెలుసు.. ఆవేశంగా సాయిధరమ్ తేజ్ వార్నింగ్
మెగా పవర్‌స్టార్ రాంచరణ్ జన్మదినం మార్చి 27. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మెగా అభిమానులు మార్చి 26వ తేదీ రాత్రి హైదరాబాద్ శిల్పకళావేదికలో రాంచరణ్ బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పెద్ద ఎత్తున అభిమానులతోపాటు దిల్ రాజు, మైత్రీ నవీన్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సాయిధర్ తేజ్ మాట్లాడుతూ..

అప్పుడు చిరంజీవి.. ఇప్పుడు రాంచరణ్
నేను హైదరాబాద్‌కు వచ్చిన కొత్తలో మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. 2004-05లో జరిగిన సెలబ్రేషన్స్‌కు హాజరై పెద్ద మామయ్యను కలిసి విషెస్ చెప్పాం. అలా గ్రాండ్‌గా ప్రతీ ఏటా జరుగుతూ వచ్చాయి. ఆ సమయంలో మళ్లీ ఇంత గ్రాండ్‌గా ఎవరికైనా బర్త్ డే సెలబ్రేషన్స్ జరుగుతాయా అని అనుకొనే వాడిని. 2019 నుంచి మెగా పవర్ స్టార్ రాంచరణ్‌కు అంతే గ్రాండ్‌గా జరుగుతూ వస్తున్నాయి అని సాయిధరమ్ తేజ్ అన్నారు.
అంటీల కనిపించిన జాన్వీ కపూర్.. బొద్దుగా ముద్దుగుమ్మలా

మెగా, పవర్ స్టార్ ప్రోత్సాహంతోనే...
మెగా కుటుంబంలో రాంచరణ్ తన ప్రతిభతో ఎదుగుతూ వస్తున్నారు. చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రోత్సాహంతోనే ఆయన మెగా పవర్ స్టార్ అయ్యారని సాయిధరమ్ తేజ్ చెప్పారు. అంతలోనే అభిమానులు పవర్ స్టార్ జై అంటూ గొడవ చేయడంతో జై మెగాస్టార్, జై పవర్ స్టార్, జై మెగా పవర్ స్టార్, జై స్టైలిష్ స్టార్ అని సాయిధరమ్ తేజ్ జైకొట్టారు.

చిరంజీవి స్పూర్తితోనే..
సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమలో మెగాస్టార్ మహా వృక్షం లాంటి వాళ్లు. ఆయన స్పూర్తితోనే నేను, రాంచరణ్, వరుణ్ తేజ్, శిరీష్, వైష్ణవ్ తేజ్, అల్లు అర్జున్ హీరోలా మారాం. మా కెరీర్ బాటలో పరిగెత్తించేలా చేసింది చిరంజీవి గారే అంటూ భావోద్వేగానికి గురయ్యారు.

వాళ్లు ద్వేషిస్తే.. మేము ప్రేమిస్తాం...
గత కొద్దికాలంగా మాపై కొందరు పనిగట్టుకొని తప్పుడు ప్రచారం, విమర్శలు చేస్తున్నారు. మమల్ని ద్వేషించే వారికి మేము ఇచ్చేది ప్రేమ ఒకటే అంటూ ఆవేశంగా మాట్లాడారు. మేము ప్రేమిస్తూనే ఉంటాం. మెగా ఫ్యామిలీ తమ అభిమానులను ప్రేమిస్తూనే ఉంటారు. మమల్ని ద్వేషించే వారెవరో మనకు తెలుసు అని సాయిధరమ్ తేజ్ ఎమోషనల్ అయ్యారు.

మీకెప్పుడు దాసులమే..
రాంచరణ్ బర్త్ డే వేడుకలు ఘనంగా జరగడానికి కారణం మెగాఫ్యాన్స్. వారు ప్రేమ చూపిస్తున్నారు కాబట్టే ఇంత ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి. ఒకప్పుడు స్వామినాయుడు వేడుకలను ఘనంగా జరిపేవారు. ఇప్పుడు రాంచరణ్ బర్త్ డే వేడుకల బాధ్యతను ఫ్యాన్స్ తీసుకొన్నారు. మీకెప్పుడు దాసులుగా ఉంటాం అని సాయిధరమ్ తేజ్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











