twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శుభ సందర్భాన్ని ఎంజాయ్ చేస్తున్న మెగా హీరో.. ఏకంగా థియేటర్‌కు వెళ్లి మరీ!

    |

    కరోనా వైరస్ ప్రభావంతో దాదాపు ఎనిమిదిన్నర నెలల పాటు సినిమా థియేటర్లు మూత పడిపోయాయి. మహమ్మారి తగ్గుముఖం పడుతుండడంతో చాలా రాష్ట్రాల్లో సినిమా హాళ్లను పున: ప్రారంభం చేసుకోవచ్చని ఆయా ప్రభుత్వాలు అనుమతినిచ్చాయి. తెలంగాణలోనూ ఇటీవల అనుమతి లభించినా థియేటర్లు మాత్రం ఓపెన్ కాలేదు. అయితే, డిసెంబర్ 4న హైదరాబాద్ నగరంలోని కొన్ని మల్టీఫ్లెక్సులు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలోనే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నేరుగా థియేటర్‌కు వెళ్లి సినిమా చూస్తున్నట్లు ఓ వీడియోను వదిలాడు.

    శుక్రవారం ఉదయం తన నివాసం నుంచి ప్రసాద్ ఐమాక్స్‌కు వెళ్లిన సాయి ధరమ్ తేజ్.. కరోనా నిబంధనలు పాటిస్తూ థియేటర్‌లో అడుగు పెట్టాడు. అక్కడ ప్రదర్శితమవుతోన్న 'టెనెట్' సినిమాను చూస్తున్నాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు. ఈ మేరకు ప్రత్యేకంగా తయారు చేసిన ఓ వీడియోను విడుదల చేశాడు. 'ఇన్ని రోజులు వినోదం లేక బాధ పడిన సినీ ప్రియులంతా పండుగ చేసుకునే రోజు వచ్చేసింది. అందరూ మాస్కులు ధరించి కరోనా నిబంధనలు పాటించి సినిమాను థియేటర్లలో చూడాలని కోరుకుంటున్నా' అని అందులో పేర్కొన్నాడు.

    Sai Dharam Tej Went Theater for Watching Movie

    ఇదిలా ఉండగా, మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన 'ప్రతి రోజూ పండగే' సినిమాతో కెరీర్‌లోనే భారీ విజయాన్ని అందుకున్నాడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్. గత ఏడాది క్రిస్మస్ కానుకుగా విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అవడంతో పాటు కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. అంతేకాదు, ఈ కుటుంబ కథా చిత్రంలో సాయి ధరమ్ తేజ్ నటనకూ మంచి మార్కులు వచ్చాయి. ఈ క్రమంలోనే అతడు 'సోలో బ్రతుకే సో బెటర్' అనే సినిమా చేశాడు. ఈ సినిమాను కూడా థియేటర్‌లోనే రిలీజ్ చేయబోతున్నాడు. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మాత‌గా సుబ్బు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

    English summary
    Sai Dharam Tej is an Indian film actor who works in the Telugu film industry. Sai Dharam Tej made his debut as a lead in the film Pilla Nuvvu Leni Jeevitam, directed by Ravi Kumar Chowdary opposite Regina Cassandra.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X