మెగా మేనల్లుడి ఖాతాలో అరుదైన రికార్డు.. తెలుగు హీరోలందరిలో రెండో స్థానం.!

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ... తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడం కోసం కష్టపడుతున్నాడు యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్. కెరీర్ ఆరంభంలో కొన్ని విజయాలను అందుకుని సుప్రీం హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వరుస ఫ్లాపులతో సతమతమయ్యాడు. అయినప్పటికీ వెనుకడుగు వేయకుండా సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఇదిలాఉండగా, సాయి ధరమ్ తాజాగా ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఫలితంగా టాలీవుడ్‌లోనే టాప్ 2 హీరోగా నిలిచాడు. ఆ వివరాలు మీకోసం.!

ఊహించని విధంగా లాంచ్ అయ్యాడు

ఊహించని విధంగా లాంచ్ అయ్యాడు

సాయి ధరమ్ తేజ్ నటన మీద ఉన్న ఆసక్తితో హీరోగా ఎంట్రీ ఇవ్వాలని భావించాడు. ఇందులో భాగంగానే వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో ‘రేయ్' అనే సినిమా చేశాడు. అయితే, అనివార్య కారణాలతో ఈ మూవీ విడుదల ఆగిపోయింది. దీంతో ఆ వెంటనే ‘పిల్లా నువ్వు లేని జీవితం' ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ మూవీతోనే హీరోగా ఆకట్టుకున్నాడు. దీని తర్వాత ‘రేయ్' రీలీజ్ అయింది.

ఫ్లాపుల పరంపర.. చిత్రలహరితో స్టార్ట్

ఫ్లాపుల పరంపర.. చిత్రలహరితో స్టార్ట్

కెరీర్ ఆరంభంలోనే ‘సుబ్రమణ్యం ఫర్ సేల్', ‘సుప్రీమ్' వంటి హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు సాయి ధరమ్ తేజ్. వీటి తర్వాత అతడు చాలా కాలం పాటు హిట్ కోసం వేచి చూడాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఎన్నో చిత్రాల్లో నటించినప్పటికీ పరాభవం తప్పలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ మధ్య వచ్చిన ‘చిత్రలహరి' అనే మూవీతో సుప్రీమ్ హీరో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు.

పండుగ చేసుకున్న మెగా మేనల్లుడు

పండుగ చేసుకున్న మెగా మేనల్లుడు

మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రతి రోజూ పండగే' సినిమాతో కెరీర్‌లోనే భారీ విజయాన్ని అందుకున్నాడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్. గత ఏడాది క్రిస్మస్ కానుకుగా విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అవడంతో పాటు కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. అంతేకాదు, ఈ కుటుంబ కథా చిత్రంలో సాయి ధరమ్ తేజ్ నటనకూ మంచి మార్కులు వచ్చాయి.

రికార్డు బ్రేకింగ్ రేటింగ్‌తో సత్తా చాటింది

రికార్డు బ్రేకింగ్ రేటింగ్‌తో సత్తా చాటింది

బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన ‘ప్రతి రోజూ పండగే' మూవీ... కొద్ది రోజుల క్రితం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం అయింది. వెండితెరపై ఆదరించినట్లుగానే బుల్లితెరపైనా ఈ మూవీకి విశేషమైన స్పందన అందించారు తెలుగు ప్రేక్షకులు. ఫలితంగా దీనికి రికార్డు స్థాయిలో 15.2 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఈ ఏడాది అత్యధిక రేటింగ్ వచ్చిన చిత్రాల్లో ఒకటిగా నిలిచిందీ మూవీ.

మెగా మేనల్లుడి ఖాతాలో అరుదైన రికార్డు

మెగా మేనల్లుడి ఖాతాలో అరుదైన రికార్డు

థియేటర్లతో పాటు టెలివిజన్‌పైనా సత్తా చాటిన ‘ప్రతి రోజూ పండగే'.. యూట్యూబ్‌లోనూ విపరీతమైన రెస్పాన్స్ అందుకుంటోంది. అయితే, ఈ సారి తెలుగులో మాత్రం కాదు. ‘హర్ దిన్ దివాళీ' పేరిట ఈ మూవీ హిందీ వెర్షన్ ఆదివారం యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయింది. ఇది వచ్చిన 24 గంటల్లోనే 11 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఫలితంగా సాయి ధరమ్ ఖాతాలో ఓ రికార్డు వచ్చి చేరింది.

Recommended Video

Allari Naresh Naandhi Movie Teaser
తెలుగు హీరోలందరిలో రెండో స్థానం.!

తెలుగు హీరోలందరిలో రెండో స్థానం.!

విజయ్ దేవరకొండ నటించిన ‘డియర్ కామ్రేడ్' హిందీ వెర్షన్ అదే పేరుతో యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయింది. ఈ చిత్రానికీ 24 గంటల్లో 11 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు అదే తరహాలో ‘ప్రతి రోజూ పండగే'కు రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా విజయ్ దేరవకొండ తర్వాత ఈ ఘనత అందుకున్న తెలుగు హీరోగా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రికార్డులకు ఎక్కాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X