వారి విషయంలో తప్పు చేస్తే.. తగలబెట్టేస్తా .. మెగా హీరో వార్నింగ్
Sai Durgha Tej: సోషల్ మీడియాలో మితిమిరిన కామెంట్స్, వివాదాస్పద పోస్టులు పెరిగిపోతున్నాయి. విచ్చలవిడి ట్రోలింగ్ చేస్తున్న ఘటనలు కూడా రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నెట్టింట్లో చిన్న పిల్లలపై అభ్యంతరకరంగా కామెంట్స్ చేస్తున్న ఘటనలు తరుచు వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి ఘటనపై గత కొన్ని రోజుల క్రితం సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ తీవ్ర స్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే. ఆ సమస్యపై తాను ఎందుకు అంతగా స్పందించాల్సి వచ్చిందో కారణాలను వెల్లడించారు టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్. ఈ వివాదాన్ని తెర మీదికి తీసుకురావడానికి కారణాలేంటీ?
టాలీవుడ్ హీరో సాయి దుర్గా తేజ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన పర్సనల్, ప్రొఫెషనల్ పరం విషయాలను పంచుకున్నారు. తొలుత తన పేరును మార్చుకోవడంపై స్పందించారు సాయి దుర్గా తేజ. 2021లో తనకు యాక్సిడెంట్ జరిగిందని, ఆ ప్రమాదం తనకు పునర్జన్మ లాంటిదని, ఆ సమయంలో తన తల్లి తనతో ఉండాలని భావిస్తూ.. తల్లి పేరును తన పేరులో యాడ్ చేసుకున్నానని చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత ప్రణీత్ హనుమంత్ పై సీరియస్ కావడంపై క్లారిటీ ఇచ్చారు. చిన్న పిల్లలపై అభ్యంతరకర పోస్టులు పెట్టడంపై తాను ప్రణీత్ హనుమంత్ కు 24 గంటల సమయం ఇచ్చానని, కానీ, ఫలితం లేదన్నారు. ఆ సమయంలో అభ్యంతరకర పోస్టులపై ఏ ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ గాని, చైల్డ్ ప్రొటెక్షన్ సొసైటీ వాళ్ళు గాని మాట్లాడలేదన్నారు. కనీసం ఇష్యూను మీడియా, పోలీసులు కూడా పట్టించుకోలేదని, దీంతో తాను ఆ ఇష్యూపై స్పందించాల్సి వచ్చిందని తెలిపారు.
సోషల్ మీడియాలో చిన్నపిల్లలపై వల్గర్ గా కామెంట్ చేసేవాళ్లు ఎక్కువయ్యారని, అయినా.. పిల్లలపై అభ్యంతరకర పోస్టులు పెడుతూ.. కుళ్ళు జోకులు వేయడమేమిటనీ, ఆ పోస్టులకు పిచ్చివారిలా ఫన్ని రిప్లేలు ఇవ్వడమేమిటని హీరో సాయి దుర్గ తేజ్ ఆగ్రహానికి లోనయ్యారు. ఈ ఇష్యూలో తానే ఇంతగా రియాక్ట్ అవుతుంటే.. ఆ పిల్లల తండ్రులు ఎలా నలిగిపోతారని ఆలోచించారా? అని ప్రశ్నించారు.

చిన్నపిల్లలపై అభ్యంతరకరంగా కామెంట్స్ చేస్తే.. మొత్తం సోషల్ మీడియాను తగలబెట్టేస్తాననీ, అలా చేయడం చాలా పెద్ద తప్పని అన్నారు. తనకు ఎవరూ మద్దతుగా నిలువగా పోయినా తాను మాత్రం .. అలాంటి కామెంట్స్ చేసిన వారిని రోడ్డుకీస్తానని వార్నింగ్ ఇచ్చారు. రష్యా - ఉక్రెయిన్ యుద్ధ సమయంలో తెలుగు స్టూడెంట్స్ వెనక్కి వచ్చేంతవరకు తన మనసు ఆగలేదనీ, అలాగే ఇజ్రాయిల్- పాలస్తీనా అల్లర్లలో పిల్లలు చంపుతుంటే.. తన గుండె తరుక్కుపోయిందన్నారు.
అలాంటిది సోషల్ మీడియాలో చిన్నపిల్లలపై ఎవరైనా అసహ్యకర కామెంట్ పెడితే సైలెంట్ గా ఉందలేనన్నారు. ఇలాంటి పని చేసే వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలనీ, అలాగే.. నటులపై కూడా అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారనీ, అంకుల్, ఆంటీ అంటూ ట్రోల్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నటులు పడే కష్టాన్ని గుర్తించలేరు. కానీ, ఏదైనా చిన్న తప్పు చేస్తే మాత్రం ఎక్కడ లేని నిందలు వేస్తారని సాయి దుర్గ తేజ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఇలాంటి అభ్యంతకర విషయాలపై ఏపీ సీఎం కళ్యాణ్ తో కాకుండా.. తాను సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షాతో మాట్లాడుతానన్నారు. ఎందుకంటే.. ఈ ఇష్యూపై చిన్న స్థాయిలో కాకుండా.. పెద్ద స్థాయిలోకి తీసుకవెళ్లాలని అన్నారు. తాను ఖచ్చితంగా ఏదోక పరిష్కరం తీసుకవస్తానని సాయి దుర్గ తేజ్ అన్నారు.


Click it and Unblock the Notifications











