మహేష్ బాబు మహర్షిలో 'ఎవడు' విలన్!
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. భారీ స్థాయిలో ఈ చిత్ర నిర్మాణం జరుగుతోంది. ప్రతిభగల దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఓ చక్కటి సందేశంతో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. రామోజీ ఫిలిం సిటీలో నిర్మించిన భారీ విలేజ్ సెట్ లో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. ఎన్నో విశేషాలు ఉన్న ఈ చిత్రం గురించి మరో విశేషం వినిపిస్తోంది.
సీనియర్ నటుడు సాయి కుమార్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. వంశీ పైడిపల్లి, రాంచరణ్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ఎవడులో సాయికుమార్ విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. సాయికుమార్ పాత్రకు ఆ చిత్రంలో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీనితో వంశి పైడిపల్లి అతడితోనే మ్యాజిక్ చేయాలని భావిస్తున్నాడు.

పల్లెటూరి నేపథ్యంలో అద్భుతమైన డైలాగులతో చాలా చక్కగా సాయి కుమార్ పాత్రని డిజైన్ చేశారట. సినిమాలో సాయికుమార్, మహేష్ మధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది. దిల్ రాజు, అశ్వినీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











