అభిలాష స్పూర్తితో సాయిధరమ్ తేజ్ కొత్త చిత్రం!

మెగాపవర్ స్టార్ సాయిధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం చిత్రలహరి. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. వరుస పరాజయాల తర్వాత తేజు నుంచి వస్తున్న చిత్రం ఇది. సాయిధరమ్ తేజ్ ఈ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకుని ఉన్నాయి. తన తదుపరి చిత్రాలపై కూడా సాయిధరమ్ తేజ్ దృష్టి పెట్టాడు. వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతి దర్శత్వంలో సాయిధరమ్ తేజ్ తదుపరి చిత్రం ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మారుతి తేజు కోసం ఓ ఆసక్తికరమైన కథని సిద్ధం చేశాడట.

ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ లాయర్ పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మారుతి ఈ చిత్ర కథని మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ చిత్రం అభిలాషని స్ఫూర్తిగా తీసుకుని రాశారట. అభిలాష చిత్రంలో చిరంజీవి ఉరి శిక్షని రద్దు చేయాలని కోరుకునే లాయర్ గా కనిపిస్తారు. మరి సాయిధరమ్ తేజ్ ఏ ఆశయం కోసం లాయర్ గా మారుతున్నాడో వేచి చూడాలి.

Saidharam Tej new movie based on Chiranjeevis Abhilasha movie

మారుతి తెరకెక్కించిన చివరి చిత్రం శైలజారెడ్డి అల్లుడు ఆశించిన స్థాయి విజయం సాధించలేదు. సాయిధరమ్ తేజ్ చిత్రలహరి షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు ప్రారంభించింది. ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X